Bigg Boss telugu 6: బిగ్ బాస్ షో రోజురోజుకి చాలా చెత్తగా మారుతుంది. ఇందులో కొన్ని సన్ని వేశాలు సీజన్ ఇంత చెత్తగా మారిందా అనేలా చేస్తుంది. తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్ బర్త్ డే అంటూ హౌస్ మేట్స్‌కి ఓ కేకు ముక్క పంపగా, దాన్ని తినాలంటే ఎంటర్ టైన్ చేయాలని చెప్పాడు. దీని కోసం వారి వారి పర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే శ్రీహాన్‌తో రొమాన్స్ కి సై అంది శ్రీసత్య. వీరిద్దరి రొమాన్స్ చూసి అర్జున్ కళ్యాణ్ కళ్యాణ్ అదోలా చూస్తూ ఉండిపోయాడు. ఇక ‘నువ్ నాతో డాన్స్ చేస్తానని అనకుండా.. శ్రీహాన్‌తో ఎందుకు చేశావ్ అని శ్రీ సత్యని అడగగా, కావాలనే నాతో డాన్స్ చేయలేదు.. అది నాకు చెప్పింది అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు.
ఏందిరయ్య ఇది..
ఇక సూర్య, ఇనయల మధ్య ఏదో నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక బాలాదిత్య మాటి మాటికీ.. దీపు దీపు అంటుంటే నాకు మండతా ఉంది బిగ్ బాస్ అని చెప్పుకొచ్చింది గీతు. దీంతో బిగ్ బాస్.. ‘అంతమంటతో నువ్ ఈ చికెన్‌ని తినలేవులే కానీ.. మాట్లాడి మాట్లాడి బాగా అలిసిపోయినట్టు ఉన్నావ్.. ముందు కొంచెం చికెన్ తిను అన్నాడు బిగ్ బాస్. దాంతో బయటకు వెళ్లి ఓ రేంజ్‌లో బిల్డప్ ఇచ్చింది.గీతూ కాన్ఫిడెన్స్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ‘నువ్ గేమర్‌వి కాబట్టి.. బిగ్ బాస్ నీ గురించి మాట్లాడతారు.. గేమర్‌వి కాకపోతే నీ గురించి మాట్లాడరు అని గీతూకి కొంచెం బిస్కట్ వేసింది ఫైమా.
ఇక హౌస్‌లో అంతమంది ఉండగా.. బిగ్ బాస్ మాత్రం గీతుకి ఎందుకు ఫుల్ ఫుటేజ్ ఇవ్వడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు అంటూ కొందరు నోరెళ్లపెడుతున్నారు. ఆమెతో దాదాపు అరగంటకు పైగా సోది పెట్టిన బిగ్ బాస్, మిగిలిన వాళ్లకి పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఇవ్వకుండా చేశాడు. మొత్తానికి బిగ్ బాస్ బర్త్ డే ఎపిసోడ్ సో.. సోదిలా మారింది అని అంటున్నారు. అయితే ఇందులో పెర్ఫామెన్స్‌ని బట్టే కెప్టెన్సీ ఎంపిక ఉండటం మరో విశేషం.
ఇవి కూడా చదవండి :
Mustard: ఆవాలు తినండి, మీ జ్ఞాపక శక్తి పెంచుకోండి..!
Ravi Teja: మాస్ మహరాజా పరిస్థితి ఏంది ఇలా అయింది.. రేస్‌లో ఉన్నట్టా, లేనట్టా?