Bigg Boss6: ప్రతి సీజన్ మాదిరిగానే ఈ సీజన్లోను చివరి వారంలో హౌజ్‌మేట్స్ జర్నీ చూపిస్తూ వాళ్లని ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నాడు బిగ్ బాస్. సోమవారం రోజు రేవంత్, శ్రీసత్యలకు సంబంధించిన వీడియోలు ప్లే చేయగా, తాజా ఎపిసోడ్లో ఆదిరెడ్డి, రోహిత్‌లకు వెల్కమ్ పలికాడు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, రోహిత్‌లు చాలా ఎమోషనల్ అయ్యారు. మొదట శ్రీహాన్, రేవంత్ ల మధ్య గత విషయాలు చర్చకు రాగా, స్నేహం గురించి వీరిద్దరు కామెంట్లు చేసుకున్నారు. ఓ విషయంలో శ్రీహాన్‌ని నిలదీశాడు రేవంత్. దీంతో ఇద్దరూ కాస్త హాట్‌గానే చర్చించుకున్నారు.
అనంతరం ఆదిరెడ్డిని గార్డెన్ ఏరియాకి పిలిచారు బిగ్ బాస్. గార్డెన్ మొత్తం ఆదిరెడ్డి హౌజ్‌లో ఉన్న రోజుల్లోని మధుర క్షణాలను బంధించి ఫోటోలు, వీడియోల రూపంలో అక్కడ సాక్షాత్కరింపజేశారు. తన భార్యతో ఫోన్ సందేశానికి ఉబ్బితబ్బిబ్బయిన ఆదిరెడ్డి తన జర్నీని చూసి ఫుల్ ఫిదా అయ్యాడు. కామన్ మ్యాన్ గా వచ్చి ఇప్పుడు అందరి మనసుల్లో నిలిచిపోయావని ఒక రేంజ్లో ఆయన గురించి చెప్పడంతో ఆదిరెడ్డి సైతం ఎమోషనల్ అయ్యారు. ఒక కామన్ మ్యాన్‌గా తనని హౌజ్‌లోకి వచ్చానని, బిగ్‌బాస్ తనని సెలబ్రిటీ చేసిందన్నారు. ఇది తనకు మోస్ట్ ఎమోషనల్ మూవ్ మెంట్ అని, హౌజ్‌లో లాస్ట్ సెకన్ వరకు ఉండాలనే తన కల నెరవేరిందని, జీవితాంతం బిగ్‌బాస్ కి రుణపడి ఉంటానని ఆదిరెడ్డి అన్నారు.
ఇక రోహిత్ వంతు రాగా, చాలా స్ట్రాంగ్‌గా ఉండే రోహిత్ సైతం తన ఫోటోలు, తన భార్య ఇన్ స్పైరింగ్ వర్డ్స్ విని ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు బిగ్ బాస్ తన గురించి చెప్పిన తీరుకి పడిపోయాడు రోహిత్. కిస్ కోసం వెయిట్ చేస్తున్నట్టు మెరీనా పేర్కొంది. మరోవైపు రోహిత్‌ని మొసలితో పోల్చాడు బిగ్‌బాస్. మొసలి బలం నీటిలోనే ఉంటుందని, బయటకు వస్తే అది చాలా కామ్‌గా ఉంటుందని, సమయం వచ్చినప్పుడు తానేంటో చూపిస్తుందని అలా రోహిత్ ఉన్నాడని వర్ణించిన తీరుకి రోహిత్ ఫిదా అయిపోయాడు. చివరగా రోహిత్‌కి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పాడు బిగ్ బాస్. ఇక కీర్తి, శ్రీహాన్‌లకు అభినందనలు చెప్పే అవకాశం ఉండగా, ఈ రోజు ఒకరిని ఎలిమినేట్ చేయబోతున్న విషయం తెలిసిందే.