Telugu Flash News

bigg boss telugu season 7 winner | బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్

bigg boss telugu season 7 winner pallavi prashant

bigg boss telugu season 7 winner |

ఉల్టా పుల్టా అంటూ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్-7, 105 రోజుల పాటు సాగింది. చివరికి రైతు బిడ్డ, యూ-ట్యూబర్ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. రన్నరప్‌గా అమర్ దీప్ నిలిచాడు.

బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మెంట్ ఎంట్రీగా వచ్చిన పల్లవి ప్రశాంత్, తన పట్టుదలతో, ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. టాస్క్‌లను పరిష్కరించడంలో అందరికీ గట్టి పోటీ ఇచ్చాడు. రైతు బిడ్డగా ప్రశాంత్ తనకు వచ్చిన రూ.35 లక్షలు రైతులకే ఇస్తానని చెప్పాడు.

చివరి వరకూ నటుడు అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఓట్లు పొందడంతో పల్లవి ప్రశాంత్ ‘బిగ్ బాస్ సీజన్-7’ విజేతగా నిలిచాడని నాగార్జున తెలిపారు.

పల్లవి ప్రశాంత్ ఈ విజయంతో తన లక్ష్యాన్ని సాధించాడు. అతని విజయంతో రైతు బిడ్డలకు ఒక స్ఫూర్తి నిలిచాడు.

Exit mobile version