bigg boss telugu season 6: నామినేషన్స్ లో బిగ్ బాస్ హౌజ్ ఎంత హీటెక్కిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏవోవో పాయింట్స్ తీసి నామినేషన్ చేయాలనుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో కంటెస్టెంట్స్ మధ్య చర్చ భీకర స్థాయికి చేరుకుంటుంది. ఆరో వారంలో అంతా ఊహించినట్టే సుదీప ఎలిమినేట్ అయ్యారు . ఇక ఏడో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సోమవారం జరగగా, ఈ నామినేషన్ ప్రక్రియలో ముఖ్యంగా వాసంతి, బాలాదిత్య, ఇనయ, శ్రీహాన్, రాజ్, రేవంత్‌లు రెచ్చిపోయారు. నాగార్జున ఇచ్చిన వార్నింగ్ నేపథ్యంలో ఇనయ తన ఆటేంటో చూపిస్తానంటూ సూర్యతో ముచ్చటించింది.
నాపై వచ్చిన ఆరోపణుల నిజం కాదని నిరూపిస్తూనే, నా ఆట ఏంటో చూపిస్తానంటూ ఇనయ శపథం చేసింది. ఇనయ వెళ్లిపోయాక సూర్య ఒక్కడే మాట్లాడుకుంటూ ఇనయ గేమ్ ఆడేలా చేస్తాను, ఆమె తన వల్ల డెడ్ కాకూడదు అని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది.. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ జరగగా, అత్యధికంగా 13 మంది నామినేట్ అయ్యారు. వీరిలో రేవంత్, బాలాదిత్య, రోహిత్, వాసంతి, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనయ, అర్జున్, కీర్తి, శ్రీ సత్య, మెరీనా, రాజ్, ఫైమాలు ఉన్నారు. నామినేషన్ ప్రక్రియలో శ్రీహాన్- ఇనయ మధ్య వార్ పీక్స్ లో ఉంది.
పోటాపోటీగా…
ఇనయని నామినేట్ చేసినప్పుడు తనని లయర్ అంటూ మాట్లాడిందని ఆరోపించగా, అది నిజం కాదని, నువ్వు కావాలనే నన్ను నామినేట్ చేస్తున్నావంటూ ఇనయ విమర్శించింది. అప్పుడు ఏం పీకావ్ అంటూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది ఇనయ. కాసేపు వీరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరగగా, ఇయన వంతు వచ్చినప్పుడు శ్రీహాన్‌ని నామినేట్ చేసింది.ఒకానొక దశలో ఆయన `ఏయ్ `అంటూ మాట్లాడగా, . దీనికి ఇనయ ఫైర్ అయ్యింది. ఏయ్‌ఏంటి ఏయ్.. నువ్వు అంటే భయపడలా అంటూ మండిపడింది.
మరోవైపు వాసంతి, రాజ్‌ల మధ్య కూడా సీరియస్ డిస్కషన్ జరిగింది. నామినేషన్ అంటే వాసంతి భయపడుతుందని రాజ్ ఆరోపించగా, వాసంతి కూడా ఘాటుగా స్పందించింది. మరోవైపు అర్జున్ విషయంలో, మెరినా విషయంలో ఆదిరెడ్డి కూడా సీరియస్ అయ్యాడు. తాను నిద్ర పోయానని పదే పదే నామినేషన్‌చేయడంతో చివరికి రేవంత్ షర్ట్ ఇప్పేసి పుష్ప మాదిరిగా తగ్గేదెలే అంటూ యాక్షన్ చేయడం అందరికి కాస్త నవ్వు తెప్పించింది. మొత్తానికి ఈ వారం నామినేషన్ ప్రక్రియ చాలా వాడివేడిగానే సాగిందనే చెప్పాలి. 13 మంది నామినేట్ కాగా, వీరిలో ఎవరు హౌజ్ వీడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.