Homebigg boss telugu season 6Bigg Boss telugu 6: నామినేష‌న్స్‌తో వేడెక్కిన బిగ్ బాస్ హౌజ్.. ఆమె టార్గెట్‌గా మారిందా?

Bigg Boss telugu 6: నామినేష‌న్స్‌తో వేడెక్కిన బిగ్ బాస్ హౌజ్.. ఆమె టార్గెట్‌గా మారిందా?

Telugu Flash News

Bigg Boss telugu 6: బిగ్ బాస్ సీజ‌న్ 6 కార్య‌క్ర‌మం రోజురోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న విష‌యం తెలిసిందే. ఇక సోమ‌వారం వ‌చ్చిందంటే నామినేష‌న్స్ ప్ర‌క్రియ చాలా వాడివేడిగా సాగుతుంది. కంటెస్టెంట్స్ ఏదో ఒక కార‌ణాలు చూపిస్తూ నామినేట్ చేస్తుంటారు.

ఇక తాజా ఎపిసోడ్‌లో నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా బిగ్ బాస్ ఒక్కొక్కరు ఇద్దరిద్దరు చొప్పున నామినేట్ చేయాలని.. ఎవర్నైతే నామినేట్ చేయాలని అనుకుంటారో వాళ్ల తలపై కుళ్లిపోయిన టమోటాలను పగలగొట్టాలని చెప్పారు బిగ్ బాస్. దీంతో ముందుగా శ్రీహాన్ రంగంలోకి దిగాడు.. కాస్త ఓవ‌ర్ యాక్టింగ్ చేస్తూ ఆయ‌న నామినేట్ చేసిన విధానం కాస్త చిరాకు తెప్పించింది.

నామినేష‌న్స్ వేరే లెవ‌ల్ లో..

రాజశేఖర్‌, ఇనయాలను శ్రీహాన్ నామినేట్ చేయ‌గా, ఇనయ, రేవంత్ లను సుదీప.. చంటి, ఇనయలను గీతూ.. రేవంత్‌, సూర్యలను వసంతి.. ఇనయ, రేవంత్‌లను ఆరోహి, శ్రీ సత్య.. సూర్య, రేవంత్ లను బాలాదిత్య.. సుదీప, శ్రీహాన్‌ లను ఇనయ.. గీతూ, ఇనయాలను చంటి.. రాజ్‌, గీతూలను అర్జున్.. వసంతి, ఇనయలను సూర్య.. శ్రీసత్య, ఆరోహిలను రేవంత్.. శ్రీహాన్‌, ఆరోహిలను రాజ్‌.. సూర్య, ఇనయలను రోహిత్‌-మరీనా.. ఇనయ, రేవంత్లను కీర్తి నామినేట్‌ చేశారు. అత్యధికంగా ఇనయకి 8 నామినేషన్లు వచ్చాయి.

మొత్తంగా ఈ నామినేషన్స్‌లో ఇనయని మరోసారి టార్గెట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. సాధార‌ణంగా ఏ కంటెస్టెంట్‌ని అయితే హౌస్ మేట్స్ టార్గెట్ చేస్తుంటారో.. ఆ కంటెస్టెంట్‌కి ఆడియన్స్ నుంచి మద్దతు లభిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.

ఇప్పుడు ఇన‌య‌కి కూడా అదే రేంజ్‌లో పాపులారిటీ పెరుగుతుంది. చూస్తుంటే ఈ అమ్మ‌డిని వీళ్లే టాప్ 5కి తీసుకువెళ్లేలా క‌నిపిస్తున్నారు. ఇక ఈ ప్రక్రియలో ఇనయ పలు బూతు పదాలు వాడగా, కీర్తి కూడా అంతే పనిచేసింది. ఓ వైపు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంటే చంటి, శ్రీసత్య గుసగుసలాడుకోవడం, చంటి ఓ బూత్‌ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడంతో బిగ్ బాస్ చుర‌క‌లంటించిన‌ట్టు తెలుస్తుంది.

మొత్తంగా ఈ వారం నామినేష‌న్స్‌లో పది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారిలో ఇనయ, రేవంత్, ఆరోహి, సూర్య, సుదీప, శ్రీహాన్, గీతు, రాజ్, అర్జున్, కీర్తి ఉన్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News