Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ సీజన్ 6లో దారుణాతి దారుణాలు జరుగుతున్నాయి. హౌజ్‌మేట్స్ ఎప్పుడు ఏం చేస్తున్నారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అర్ధం కావడం లేదు.
తాజా ఎపిసోడ్‌లో గీతు.. రేవంత్‌కి టిప్స్ ఇచ్చింది. ‘ఆడ పిల్లకాయలతో ఫ్రీ మోడ్‌లో వెళ్లిపోతున్నావ్.. వాళ్లు కంఫర్టబుల్‌నా కాదో చూస్కో అని సలహా ఇచ్చింది.. నువ్ ఎంత ఫ్రీగా ఉన్నావో కానీ కంఫర్ట్ కూడా చూసుకోవాలి అంటే దానికి రేవంత్.. ఛీ ఛీ నాకు ఆ ఉద్దేశమే లేదు అన్నాడు.. నిన్న ఫైమా మీద కూడా పడుకున్నావ్, తను కంఫర్టబుల్‌నా కాదో కూడా నీకు తెలియదు.
కంఫర్ట్‌నా కాదా, అని అడుగు? లేదంటే వాళ్లు ఫీల్ అవుతారు.. బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది ఏంట్రా వీడు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటారు.. ఇది వేరేలా వెళ్లదు బట్.. నీకు జాగ్రత్త చెప్తున్నా.. మీ ఆవిడ కూడా ఏం అనుకోకూడదు కదా’ అని రేవంత్‌కి పలు సలహాలు ఇచ్చింది గీతు.
రచ్చ రచ్చ..
ఇక ఆ సమయంలో ఫైమా అటు రాగా, ‘నేను నిన్న నీ మీద పడుకున్నాను కదా.. ఏం అనుకోకు’ అని రేవంత్ చెప్పడంతో, ‘ఏ.. ఎవరైనా ఏమైనా అంటున్నారా? అని అన్నది ఫైమా.. ఛీ ఛీ మామూలుగానే నేను చెప్తున్నా అని రేవంత్ అంటే.. ‘నువ్ నా మీద పడుకున్నందుకు నేనేం ఫీల్ కావడం లేదు.. నువ్ ఫీల్ కాకు అంటూ ఆ విషయాన్ని చాలా లైట్ తీసుకొని వెళ్లింది.
అసలు ఈ విషయాలు ఎపిసోడ్ లో ప్రసారం కాలేదు. కాని గీతూ చెప్పడం వలన ఇది హైలైట్ అయింది. ఈ విషయం వలన రేవంత్ కాస్త నెగెటివిటీ ఎదుర్కొనే అవకాశం ఉంది.
బిగ్ బాస్ హౌస్ లో నెక్స్ట్ కెప్టెన్ ఎంపిక కోసం టాస్క్స్ జరుగుతుండగా, ఇందులో బాగా ఎంటర్టైన్ చేసిన ఆరుగురు కంటెస్టెంట్స్ పేర్లు చెప్పాలని ప్రస్తుత కెప్టెన్ కీర్తిని ఆదేశించాడు. దీంతో ఫైమా, బాల ఆదిత్య, సింగర్ రేవంత్, రాజ్, గీతూ, సూర్యలను కీర్తి ప్రకటించింది. దీంతో కొందరు హర్ట్ అయ్యారు.
కీర్తి ఎంపిక చేసిన ఆరుగురు కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వగా, ఇందులో గార్డెన్ ఏరియాలో ఉంచిన కర్రలను గొడ్డలిలో కట్ చేయాలి. కర్రలకు ఓ బ్యాగ్ తగిలించి ఉండగా, అందులో బిగ్ బాస్ లోగో కి సంబంధించిన ముక్కలు ఉంటాయి. వాటిని క్రమ పద్ధతిలో అమరిస్తే అందులో ముగ్గురు కంటెస్టెంట్స్ నెక్స్ట్ లెవల్ కి వెళతారని బిగ్ బాస్ సూచించాడు.
ఈ ఫిజికల్ అండ్ మైండ్ గేమ్ లో సూర్య అత్యుత్తమ ప్రదర్శన కనబరచగా,. చాలా తక్కువ సమయంలో టాస్క్ పూర్తి చేసిన బాల ఆదిత్య, రేవంత్ కెప్టెన్సీ రేసులో నిలుస్తారు.
ఈ వారం ఎలిమినేషన్ లో చంటి, ఫైమా, ఇనయా, ఆదిరెడ్డి, మెరీనా, బాల ఆదిత్య, వాసంతి, అర్జున్ ఉన్నారు. వీరిలో ఒకరు వచ్చే వరం హౌస్ వీడనున్నారు.
ఇవి కూడా చదవండి :
Gold Rates: బాబోయ్ .. పరుగులు పెడుతున్న బంగారం ధరలు..
Turmeric benefits : పసుపు ఆరోగ్యానికి ఎంత ప్రయాజనం కలిగిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!