bigg boss telugu 6: బిగ్ బాస్ సీజన్ 6 షోలో కంటెస్టెంట్స్ దారుణంగా ప్రవర్తిస్తున్నారు.ముద్దులు, హగ్గులు, బెదిరింపులు ఇలా ఒకటేంటి కెప్టెన్సీ టాస్క్‌లో ఎన్నో నడిచాయి. గురువారం నాటి 26 ఎపిసోడ్‌లో అందరికంటే హయ్యెస్ట్ డబ్బులు నా దగ్గరే ఉన్నాయని గీతు గర్వంగా చెప్పుకు రాగా, శ్రీ సత్య 2500 ఇచ్చిందని.. అలాగే వాసంతి 1000 ఇచ్చిందని.. బంగారు బిడ్డ వాసంతి అని మురిసిపోతు కనిపించింది. అర్జున్ ఎక్కువ ఇచ్చాడు అంటూ శ్రీ సత్య ఫ్లైయింగ్ కిస్‌లు పెట్టింది. ఆ సమయంలో నువ్ అడగాలే కానీ రెట్టింపు ఇస్తా.. అది ఏదైనా సరే.. అని మనోడు ఏదో ఫీలైపోయాడు.
ఏందీ రచ్చ..
ఇక గీతూ ఎప్పుడు లేని విధంగా కన్నీళ్లు పెట్టుకుంది. మన గురించి మనం ఆలోచించకుండా వాళ్లు బాగుండాలని మనం ఆలోచిస్తుంటే.. వాళ్లు వాళ్లు హ్యాపీగా ఉంటున్నారు అంటూ తెగ ఫీలైపోయింది.
మరోవైపు ఇనయ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయే వారి గురించి జోస్యాలు చెప్పుకొచ్చింది. రాజ్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు అని చెప్పింది.
శ్రీహాన్‌ని ‘నా గేమ్ ఎలా ఉంది’ అని రేవంత్ అడిగితే.. ‘కొంచెం డల్ అయ్యావ్ అనిపిస్తుంది.. నువ్ ఏడ్చావంట కదా.. నాకు ఆర్జే సూర్య చెప్పాడు’ అని అద్దం స్టార్ శ్రీహాన్ చెప్పుకొచ్చాడు.
ఇక సూర్య అన్నం పడేయగా, నువ్ అన్నం ఎలా పడేస్తావ్ అని ఆరోహి అని అడగ్గా, నాకు ఆకలిగా లేదు.కాలేది నాకే కదా అని అన్నాడు. నా ఫుడ్ నేను పడేశా.. నేను కష్టపడి ఇష్టపడి వండుకున్నదే పడేశా’ అంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేయగా, ఆయనకు నాగార్జునతో మూడినట్టేనని కొందరు చెబుతున్నారు.
ఆరోహి కారణంతో సూర్య ఆట ఆడడమే మానేశాడు. వీరిద్దరు ఎప్పుడు చూసిన ఏదో విషయంలో రచ్చ చేయడం తప్ప ఆట ఆడింది లేదు. ఈ ఎవారం చూస్తుంటే ఈ వారం ఆరోహి హౌజ్ నుండి బయటకు వెళ్లనుందని అంటున్నారు. ఇక రేవంత్ తన భార్య సీమంతం చూసి ఎమోషనల్ అయ్యాడు.
గార్డెన్‌లో కూర్చొని ముచ్చటిస్తుండగా, పక్కకు వచ్చిన గీతూ.. ఆది రెడ్డి చెవి వద్ద ఏదో చెబుతూ ఉంది. దీంతో మండిపోయిన ఆదిరెడ్డి గీత గువ్వ పగలగొడతాను అని నవ్వులు పూయించాడు.