Homebigg boss telugu season 6Bigg Boss Nominations: వాడివేడిగా నామినేష‌న్స్.. రేవంత్‌కి క్లాస్ పీకిన ఫైమా

Bigg Boss Nominations: వాడివేడిగా నామినేష‌న్స్.. రేవంత్‌కి క్లాస్ పీకిన ఫైమా

Telugu Flash News

Bigg Boss Nominations: బిగ్ బాస్ సీజ‌న్ 6 మ‌రి కొద్ది రోజుల‌లో ముగియ‌నుంది. ప్ర‌స్తుతం హౌజ్‌లో కేవ‌లం 8 మంది ఇంటి స‌భ్యులు మాత్ర‌మే ఉన్నారు. చివ‌రిగా రాజ్ ఎలిమినేట్ కావ‌డంతో కొంత మంది ఎమోష‌న‌ల్ అయ్యారు. 13వ వారం నామినేష‌న్స్ కూడా చాలా వాడివేడిగా సాగాయి. అయితే నామినేష‌న్స్ క‌న్నా ముందే హౌజ్‌మేట్స్ మ‌ధ్య కొంత గొడవ అయితే మొద‌లైంది. రేవంత్‌, శ్రీహాన్‌ మధ్య ఘాటుగానే చర్చ జర‌గ‌గా, తనని పర్సనల్‌గా కామెంట్‌ చేస్తున్నాడని శ్రీహాన్ అన్నాడు.. చూసే దృష్టిని బట్టి ఉంటుందని రేవంత్‌ అన్నారు. ఎవరు ఏది కావాలని పోట్రే చేయరని రు శ్రీహాన్ అన‌డంతో, రేవంత్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక శ్రీసత్యతో తన నడక, తన ముక్కు,తన మాటల గురించి కామెంట్లు చేస్తున్నారని వాపోయాడు శ్రీహాన్.

ఫైమా, రేవంత్‌, ఆదిరెడ్డి మధ్య చాడీలకు సంబంధించి చ‌ర్చ న‌డిచింది. అనంతరం నామినేష‌న్స్ మొద‌లు కాగా, హౌజ్‌మేట్స్ రెచ్చిపోయారు. మొదట ఆదిరెడ్డి.. రేవంత్‌ని నామినేట్ చేయ‌గా, మానిప్యూలేటర్‌ అనే కామెంట్లని ప్రస్తావిస్తూ నామినేట్‌ చేస్తున్నానని తెలిపారు. దీనికి సంబంధించిన చర్చ ఇద్దరి మధ్య చ‌ర్చ వాడివేడిగా సాగింది. రోహిత్‌ని నామినేట్‌ చేస్తూ ఫైట్‌ చేయడం లేదని, కొంత స్టాండ్‌ తీసుకోవడం లేదన్నారు. ఇక ఫైమా.. రేవంత్‌, రోహిత్‌లను నామినేట్‌ చేసింది. ఇక శ్రీహాన్‌.. స్టాండ్‌ తీసుకోవడం లేదని రోహిత్ ని నామినేట్‌ చేయగా, టాస్క్ లో ఇక అమ్మాయిలతో ఆడి గెలవండి అంటూ కామెంట్‌ చేయడాన్ని అభ్యంతరం చెబుతూ ఆదిరెడ్డిని నామినేట్‌ చేశాడు.

కీర్తి.. రేవంత్‌, శ్రీ సత్యలను నామినేట్ చేయ‌గా, . శ్రీ సత్య.. కీర్తిని, ఆదిరెడ్డిలను నామినేట్‌ చేసింది.. రోహిత్‌.. ఆదిరెడ్డి, ఫైమాలను నామినేట్ చేయ‌గా, రేవంత్‌.. ఆదిరెడ్డి, ఫైమాలను నామినేట్‌ చేశాడు. చేయనని దానికి చేశాడని చెబుతున్నావంటూ ఆదిరెడ్డిని నామినేట్‌ చేశాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవ వాతావరణం చోటు చేసుకుంది. ఇక రేవంత్‌ నిజ స్వరూపం బయటపెట్టింది ఫైమా. ఇన్నాళ్లు ఇదే జరుగుతుందని, కానీ దీన్ని ఎవరూ గుర్తించడం లేదంటూ ఫాకింగ్ కామెంట్స్ చేసింది. ఇనయ.. రేవంత్‌, శ్రీ సత్యలను నామినేట్‌ చేసింది. ఇక ఫైనల్‌గా 13వ వారంలో కెప్టెన్‌ ఇనయ, శ్రీహాన్‌ నామినేషన్లకి దూరం కాగా, రేవంత్‌, ఆదిరెడ్డి, కీర్తి, ఫైమా, శ్రీసత్య, రోహిత్‌లు నామినేష‌న్‌లో ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తారో చూడాలి .

also read news:

horoscope today : 29-11-2022 రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే ?

‘టీ’ అనే పేరు ఎలా వచ్చింది ? చాయ్ చరిత్ర ఏంటి ? ఈ స్టోరీ చదివి తెలుసుకోండి

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News