Homebigg boss telugu season 6Bigg Boss telugu 6: గ‌బ్బుగా మారుతున్న బిగ్ బాస్ హౌజ్..మ‌సాజ్‌లు ఏంది, తినిపించుకోవ‌డాలు ఏంది?

Bigg Boss telugu 6: గ‌బ్బుగా మారుతున్న బిగ్ బాస్ హౌజ్..మ‌సాజ్‌లు ఏంది, తినిపించుకోవ‌డాలు ఏంది?

Telugu Flash News

Bigg Boss telugu 6: బిగ్ బాస్ కార్య‌క్ర‌మంకి కాస్త రేటింగ్స్ త‌గ్గుతున్న నేప‌థ్యంలో నిర్వాహ‌కులు కాస్త మ‌సాలా ద‌ట్టిస్తున్నారు. సోమ‌వారం నాటి నామినేష‌న్స్‌తో బిగ్ బాస్ హౌజ్ ఎంత వేడెక్కిందో మ‌నం చూశాం. ఇక మంగ‌ళ‌వారం ఎపిసోడ్‌లో రోహిత్ మెరీనా వెళ్లి ఇన‌య‌కి సారీ చెప్పారు. నామినేట్ చేసి ఇప్పుడు వెళ్లి సారీ చెప్ప‌డంపై ఫైమా ఫైర్ అయింది.

ఇక శ్రీహాన్ తనలో తాను మాట్లాడుకుంటూ త‌న‌కేదో జ‌బ్బు ఉంద‌నేలా ప్రొజెక్ట్ అవుతున్నాడు. ఆదిరెడ్డి ఎప్ప‌టి మాదిరిగానే ఎలిమినేష‌న్స్ స్టార్ట్ చేశాడు. సూర్య, రేవంత్, గీతు, శ్రీహాన్ ఈ నలుగురు తప్ప ఎవరైనా పోయే అవ‌కాశం ఉంద‌ని రేవంత్‌తో చెప్ప‌గా, దానికి రేవంత్‌ ఇనయ కూడా వెళ్లదని ఆదిరెడ్డితో అన్నాడు.

ఏంది సామి..

ఇక రేవంత్ పైకి ధైర్యంగా ఉన్నా తాను కూడా ఎలిమినేట్ అవుతాన‌నే భ‌యంలో ఉన్నాడు. మంగళవారం షోలో బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లకి కెప్టెన్సీ టాస్క్ ఇవ్వ‌గా, `హోటల్‌ వర్సెస్‌ హోటల్‌` టాస్క్ లో `బీబీ హోటల్‌`, `గ్లామ్‌ హోటల్‌` అనే రెండు హోటల్స్ ఉంటాయ‌ని చెప్పారు.

ఇందులో కంటెస్టెంట్ల సర్వెంట్లుగా, చెఫ్‌లుగా, గెస్ట్ లుగా వ్యవహరిస్తార‌ని చెప్పాడు. ఇక చంటి హెల్పర్‌గా ఉండాల్సి ఉంటుంద‌ని చెప్పిన బిగ్ బాస్ ఆయనకు ఓ సీక్రెట్‌ టాస్క్ ని ఇచ్చాడు . ఈ సీక్రెట్ టాస్క్‌లో చంటి గెస్ట్ లను బీబీ హెటల్‌ నుంచి గ్లామ్‌ హోటల్ కి పంపించాల్సి ఉంటుంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో హౌజ్‌ని మసాజ్‌ సెంటర్‌గా, లవర్స్ కి అడ్డగా మార్చేసారు.

గ్లామ్‌ హోటల్‌ స్టాప్‌ ఫైమా, శ్రీసత్య, ఆరోహి, వసంతి ఐటెమ్‌ సాంగ్‌లకు డాన్సులేస్తూ చేసిన ర‌చ్చ మాములుగా లేదు. సూర్య‌ ఏకంగా ఆరోహితో మసాజ్‌ చేయించుకున్నాడు.

-Advertisement-

ఇక అర్జున్ .. శ్రీసత్యని తనకు ఫుడ్ తినిపించాలని, అలా చేస్తే ఎక్కువ డబ్బులిస్తానని కండీషన్ పెట్ట‌డంతో ఆమె అర్జున్‌కి ఫుడ్‌ కలిపి గోరు ముద్దులు పెట్టింది. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రి మధ్య ఏదో తెలియ‌ని బాండింగ్ క‌నిపించింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News