బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ (bigg boss telugu 6) షో రోజురోజుకి ఆసక్తికరంగా మారుతుంది.అయితే గతంలో ఉన్నంత జోష్ ఇప్పుడు లేదు. మొత్తం 21 మంది కంటెస్టెంట్స్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఎంటర్ టైన్మెంట్ చేసింది లేదు. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. ఈ టాస్క్‌లను రద్దు చేస్తున్నాం.. ఈ షోపట్ల.. ప్రేక్షకుల పట్ల గౌరవం లేకపోతే.. బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోండి అని తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్న రేంజ్‌లోనే ఈ గేమ్ ఆడుతూ వస్తున్నారు.
ఒళ్లు మండింది..
ఏడో వారంలో నామినేషన్లలోనూ పెద్దగా ఆసక్తి లేదు. ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్లు తప్ప మరెవ్వరూ పెద్దగా స్పందించడం లేదు. ఇక మంగళవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో కెప్టెన్సీ కంటెండెర్ల కోసం బిగ్ బాస్ సెలబ్రిటీ గేమ్ టాస్క్ ఇవ్వగా, ఇందులో కంటెస్టెంట్స్ ఇంటి సభ్యులు సినిమాలోని పాత్రలు పోషించాల్సి ఉంది. ఒక్కొక్కరికి ఒక్కో సినిమాలోని పాత్రలను ఇవ్వగా, సూర్యకి పుష్ప పాత్రని, గీతూకి శ్రీవల్లి పాత్రని, శ్రీహాన్‌కి చెన్నకేశవరెడ్డి పాత్ర, ఫైమాకి అరుంధతి, మెరీనాకి మిత్రవింద, వాసంతికి బొమ్మరిల్లులోని హాసిని(జెనీలియా) పాత్రని, శ్రీ సత్యకి ఫిదాలోని భానుమతి(సాయిపల్లవి) పాత్రని, రాజ్‌కి చత్రపతిలోని ప్రభాస్ పాత్రని, అర్జున్‌కి టెంపర్‌లో దయా(ఎన్టీఆర్) పాత్రని, కీర్తికి `ఒసేయ్ రాములమ్మ`లోని విజయశాంతి పాత్రలో కనిపించారు.
ఇక రోహిత్‌కి `మగధీర`లోని కాళభైరవ(రామ్‌చరణ్) పాత్రని, ఇనయకి జగదేక వీరుడు అతిలోక సుందరిలోని ఇంద్రజ(శ్రీదేవి) పాత్రని, ఆదిరెడ్డికి కూలి నెంబర్ 1, బాలాదిత్య భీమ్లా నాయక్ పాత్రని ఇచ్చారు. అనంతరం ఇంటి సభ్యులని రెండు టీములుగా విడగొట్టారు. డైనమైట్‌లో గీతూ, రోహిత్, మెరీనా, అర్జున్, రాజ్, శ్రీసత్య, వాసంతి, సూర్య ఉన్నారు. ఫాంటసీలో రేవంత్, కీర్తి, బాలాదిత్య, ఫైమా, శ్రీహాన్, ఆదిరెడ్డి ఉన్నారు. ఇనయ సంచాలకులుగా వ్యవహరిస్తుంది. అయితే ఈ టాస్క్‌లోను వీరు పెద్దగా అలరించింది లేదు. దీంతోనే బిగ్ బాస్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే శ్రీహాన్ హాజ్ మేట్స్ పైర్ అవుతూ..బిగ్ బాస్ అంటే ఏంటో కూడా తెలియని వారు ఇక్కడికి వచ్చారన్నట్టు వ్యాఖ్యానించాడు.
ఇవి కూడా చూడండి :
వయస్సు తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే..