Bigg Boss6 : మొన్నటి వరకు హౌజ్‌మేట్స్ అరుపులు, కేకలతో హోరెత్తిపోయిన బిగ్ బాస్ హౌజ్ ఇప్పుడు దెయ్యాల అరపులతో వణికిపోతుంది. సీజన్ చివరి దశకు చేరిన నేపథ్యంలో టాస్క్‌లు అన్నీ ఆపేసి ఇక ఎంటర్‌టైన్ చేసే దిశగా బిగ్ బాస్ ప్రణాళికలు చేస్తున్నారు. తాజా ఎపిసోడ్ లో.. హౌజ్ మేట్స్ గజగజా వణికేలా చేశాడు బిగ్ బాస్. ముందుగా టాస్క్ లతో మొదలైన ఎపిసోడ్ లో… ఆదిరెడ్డి-రోహిత్ మధ్య ఓ టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తారంటూ అడగ్గా.. ఆదిరెడ్డిపై ఎక్కువ డబ్బులు పెట్టారు అంతా. మరో వైపు రోహిత్ కు శ్రీసత్య మాత్రమే సపోర్ట్ చేయగా.. ఆ గేమ్ లో ఆదిరెడ్డి గెలిచాడు.
ఇక తర్వాతి గేమ్ లో శ్రీ హాన్ – కీర్తి మధ్య పోటీ జరగ్గా.. హౌస్ అంతా.. శ్రీహాన్ పై నమ్మకం ఉన్నట్టు ప్రకటించారు. శ్రీహాన్ గెలుస్తాడని చెప్పారు. అందరు అనుకున్నట్టుగానే గేమ్ లో శ్రీహాన్ విన్ అయ్యాడు. వాల్ బ్రేకర్స్ టాస్క్ లో శ్రీహాన్ విజేతగా నిలిచాడు. టాస్క్ ల ద్వారా కోల్పోయిన డబ్బును పొందడం కోసం సీక్రేట్ రూమ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ అందులో బాగంగా దెయ్యాల గది టాస్క్ పెట్టాడు. మిగతా టాస్క్ లలో తగ్గేదే లే అంటూ.. హోరా హోరీగాపోరాడుతూ.. పోటీ ఇచ్చే శ్రీహాన్ – ఆదిరెడ్డీలు దెయ్యాల గదిలోకి వెళ్లారు. ముందు గదిలోకి వెళ్ళిన ఆదిరెడ్డికి .. అక్కడ ఉన్న క్యాండిల్ వెతకమని బిగ్ బాస్ చెప్పాడు.
అనంతరం ఎవరిసహాయం అయినా తీసుకోవచ్చి అని చెప్పడంతో శ్రీహాన్ కావాలి అని అడిగాడు. బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ తో.. ఉలిక్కి పడ్డాడు శ్రీహాన్. డార్క్ రూమ్ లోకి వెళ్ళిన తరువాత క్యాండిల్ తో పాటు.. అక్కడే ఉన్న గన్ ను వెతకాల్సిందిగా బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు. దాంతో ఇద్దరు భయపడుతూ.. వణికిపోయారు. ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా.. వారిద్దరిని ఏదో రకంగా భయపెట్టారు బిగ్ బాస్. మొత్తానికి ఈ ఎపిసోడ్ మాత్రం చాలా చాలా సందడిగా సాగింది.