Homebigg boss telugu season 6Bigg Boss 6: హౌజ్‌లో సిరి, శ్రీహాన్ రొమాన్స్ మాములుగా లేదుగా..!

Bigg Boss 6: హౌజ్‌లో సిరి, శ్రీహాన్ రొమాన్స్ మాములుగా లేదుగా..!

Telugu Flash News

Bigg Boss 6: బిగ్ బాస్ సీజ‌న్ 6లో ప్ర‌స్తుతం ఫ్యామిలీ ఎపిసోడ్ న‌డుస్తుంది. ముందుగా ఆదిరెడ్డి స‌తీమ‌ణి బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్ట‌గా, ఆ త‌ర్వాత రాజ్ తల్లి, ఫైమా మ‌ద‌ర్, శ్రీ స‌త్య పేరెంట్స్, రోహిత్ త‌ల్లి వ‌చ్చి హౌజ్‌లో తెగ సంద‌డి చేశారు. ఇక శ్రీహాన్ కోసం ఎవ‌రు వ‌స్తారా అని అంద‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న నేప‌థ్యంలో సిరితో పాటు చిన్న బాబు వ‌చ్చారు. ఒక‌వైపు సిరి- శ్రీహాన్ జంట రొమాన్స్‌తో తెగ రెచ్చిపోతుంటే, మ‌రో వైపు ఓ బుడ్డోడు కూడా హ‌ల్‌చ‌ల్ చేశాడు. బిగ్ బాస్ సాంగ్ కు సిరి- శ్రీహాన్ అయితే రెచ్చిపోయి డాన్స్ వేశారు సిరికి బిగ్ బాస్ పాత ఎక్స్ పీరియన్స్ ఉండటంతో.. హౌస్ లో ఉన్నవారితో కాస్త‌ పద్దతిగా మాట్లాడింది. కాని శ్రీసత్యతో మాట్లాడుతున్నట్టే మాట్లాడి… స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు అంద‌రికి అనిపించింది.

ఇక కీర్తి కోసం హౌస్ లోకి బుల్లి తెర హీరో మహేష్ వచ్చాడు. వచ్చీ రావడంతోనే పంచులతో అందరికి వరుసపెట్టి ఇచ్చేశాడు. ఇక కీర్తీతో డాన్స్ చేస్తూ.. హాగ్ చేసుకుంటూ.. రోజ్ ఇచ్చిప్రపోజ్ చేస్తూ నానాన హంగామా చేశాడు. ఇక ఫైమాను ఇంగ్లీష్ విషయంలో ఓ ఆట ఆడుకున్నాడు మహేష్. గేమ్ విషయంలో నువ్వు ఫైటర్ వీ.. జీవితంలో చాలా కోల్పోయావ్.. కాని బిగ్ బాస్ నీకు మంచి అవకాశం.. ఇక్కడ గెలిచి చూపించు అని చాలాధైర్యం చెప్పాడు మహేష్. ఇక వెళ్తూ.. వెళ్తూ.. ఇనయాను ముద్దు అడిగి అంద‌రికి షాక్ ఇచ్చాడు.

ఇక హౌస్ లోకి ఆతరువాత ఇనయ తల్లి ఎంట్రీ ఇవ్వ‌గా, ఆమె ఇనయ చేస్తున్న పోరాటాన్ని మెచ్చకున్నారు. అంతే కాదు…కప్పు గెలిచి చూపించు.. కప్పుతోనే బయటకు రావాలి అంటూ కూతురికి చాలాధైర్యం ఇచ్చారు. అనంత‌రం బిగ్ బాస్ గేమ్ లో బాగంగా శ్రీహాన్ ప్లట్టింగ్ మాస్టార్ గా తెగ కామెడీ పండించాడు. ఇక యోగా టీచర్ గా రేవంత్ కాస్త ప్రయత్నంచేయగా.. ఫైమాతో పాటు మిగ‌తా హౌజ్‌మేట్స్ అత‌న్ని ఆడుకున్నారు.. ఇక రాజ్ ను రాత్రి భయపెట్టాలని రేవంత్, శ్రీహాన్ ట్రై చేయ‌గా, ఈ టాస్క్ లో వారు స‌క్సెస్ సాధించారు.

మరిన్ని వార్తలు చదవండి :

horoscope today : ఈ రోజు రాశి ఫలాలు 2022, నవంబర్ 25 శుక్రవారం

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News