Telugu Flash News

Bigg Boss 6 : నామినేష‌న్స్‌తో ద‌ద్ద‌రిల్లిన బిగ్ బాస్ హౌజ్.. ఈ వారం నామినేష‌న్‌లో ఎవ‌రెవ‌రు ఉన్నారంటే…

bigg boss telugu season 6

Bigg Boss 6 : బిగ్ బాస్ సీజ‌న్ 6 సక్సెస్ ఫుల్ గా న‌డుస్తుంది. రీసెంట్‌గా చంటి హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేశాడు. ఇక సోమ‌వారం వ‌చ్చిందంటే నామినేష‌న్స్ ఏ రేంజ్‌లో సాగుతాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

కంటెస్టెంట్స్ అనేక పాయింట్స్ ని తీసి నామినేట్ చేస్తున్న క్ర‌మంలో వార్ మాములుగా ఉండ‌దు. ఇక ఈ వారం నామినేష‌న్స్ విష‌యానికి వ‌స్తే మొత్తం తొమ్మిది మంది నామినేట్ అయ్యారు.

సాయంత్రం వేళ బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ చేయ‌గా,. ప్రతి సభ్యుడు ఇద్దరు సభ్యుల ముఖానికి ఫోమ్(నురగ) పూసి కారణం చెప్పి నామినేట్ చేయాలి అన్నారు.

నామినేష‌న్స్ లో…

నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో మొదటగా కెప్టెన్ రేవంత్ కారణాలు చెప్పి సుదీప, బాల ఆదిత్యను నామినేట్ చేశాడు. అనంత‌రం కీర్తి … గీతూ, శ్రీసత్యలను నామినేట్ చేసింది.

ఆదిరెడ్డి… కంటెస్టెంట్స్ మెరీనా, కీర్తిలను నామినేట్ చేశాడు. రోహిత్ కంటెస్టెంట్స్ శ్రీహాన్, ఆదిరెడ్డిలను చేయడం జరిగింది. నటి సుదీప కంటెస్టెంట్స్ ఆదిరెడ్డి, కీర్తిలను నామినేట్ చేశారు.

ఇక శ్రీహన్- గీతూ , రాజ్,… వాసంతి- గీతూ, ఆదిరెడ్డి… బాల ఆదిత్య- గీతూ, రాజశేఖర్… సూర్య- గీతూ, ఆదిరెడ్డి… ఫైమా-సుదీప, బాల ఆదిత్య… ఇనయా- శ్రీహాన్, కీర్తి… రాజశేఖర్- గీతూ, బాల ఆదిత్య… మెరీనా- కీర్తి, ఆదిరెడ్డి…. గీతూ- రాజశేఖర్, కీర్తి… అర్జున్ – కీర్తి, ఆదిరెడ్డి… శ్రీసత్య- గీతూ, ఆదిరెడ్డిలను నామినేట్ చేసారు.

అయితే ఈ సారి ఎక్కువ మంది కంటెస్టెంట్స్ రివ్యూయ‌ర్స్ గీతూ, ఆదిరెడ్డిల‌ని టార్గెట్ చేస్తూ వారిని నామినేట్ చేయ‌డం విశేషం.ఇక ఈసారి నామినేషన్స్ లో రేవంత్ లేక‌పోగా, సూర్య, వాసంతిని కూడా ఎవ‌రు నామినేట్ చేయ‌క‌పోవ‌డం విశేషం.

ఇక ఈ వారం నామినేట్ అయిన వారిలో లో ఒకరు వచ్చే వారం హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నారు. ఇక బిగ్ బాస్ షో స‌క్సెస్ ఫుల్ గా ఐదు వారాలు పూర్తి చేసుకొని ఆరో వారంలో అడుగుపెట్టింది. ఈ షో నుండి షాని, అభినయశ్రీ, నేహా చౌదరి, ఆరోహిరావు , చ‌లాకి చంటి ఎలిమినేటైన విషయం తెలిసిందే.

ఇవి కూడా చూడండి :

Exit mobile version