Homebigg boss telugu season 6Bigg Boss 6: హీటెక్కిన నామినేష‌న్స్.. ఆ ఇద్ద‌రితో రిలేష‌న్‌పై ఓపెన్ అయిన ఇన‌య‌

Bigg Boss 6: హీటెక్కిన నామినేష‌న్స్.. ఆ ఇద్ద‌రితో రిలేష‌న్‌పై ఓపెన్ అయిన ఇన‌య‌

Telugu Flash News

Bigg Boss 6: బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ఎంత మంచి వినోదాన్ని పంచుతుందో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ షోలో ప్ర‌తి సోమ‌వారం నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుండ‌గా,ఆ ప్ర‌క్రియ ఎంత రంజుగా మారుతుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో హౌజ్‌మేట్స్ రెచ్చిపోయి మ‌రీ హౌజ్ హీటెక్కేలా చేస్తుంటారు.ఇక 51 వ ఎపిసోడ్‌లో జ‌రిగిన నామినేష‌న్ ప్ర‌క్రియ చూస్తే…నామినేట్ చేసే వారు వారి ఫోటోలు మంటల్లో వేసి రీజన్స్ చెప్పాలి. మొదట శ్రీసత్య సూర్యని నామినేట్ చేసింది. ఇక ఆదిరెడ్డి.. మెరీనా, ఇనయని నామినేట్ చేశారు. ఇనయ హౌస్ లో ఎవరితో ఉపయోగం ఉంటె వారితోనే ఉంటుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఆదిరెడ్డి..

గ‌రం గ‌రంగా

inaya sultana bigg boss 6గీతూ మెరీనాని నామినేట్ చేయ‌గా, కీర్తి.. శ్రీసత్యని నామినేట్ చేసింది. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చాలా సేపు డిస్క‌ష‌న్ జ‌రిగింది. అందరూ ఒకే రీజన్ తో తనపై ఆరోపణలు చేస్తున్నారని శ్రీసత్య ఫైర్ అయింది. ఇక సూర్య.. ఇనయాని నామినేట్ చేశాడు.. హౌస్ లో అందరికి సోప్ వేసి పబ్బం గడుపుకుంటున్నారు అంటూ ఇనయా సూర్యపై సంచలన కామెంట్స్ చేసింది. అనంతరం ఇనయా.. శ్రీహాన్, సూర్య ఇద్దరినీ నామినేట్ చేస్తూ షాకింగ్ రీజన్స్ చెప్పింది. తాను శ్రీహాన్ బర్త్ డేని సెలెబ్రేట్ చేయడం వల్ల హౌస్ లో అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు అత‌నితో ఎలాంటి సంబంధం లేదంటూ ఇనయా ఓపెన్ కామెంట్స్ చేసింది.

ఈ విషయంలో స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేందుకే శ్రీహాన్ ని నామినేట్ చేస్తున్నట్లు ఇనయా పేర్కొంది. అయితే ఎవరో ఏదో అనుకుంటున్నారు అని నన్ను నామినేట్ చేయడం న్యాయమా ? ఈ విషయం అందరికి చెబితే సరిపోతుంది కదా అని శ్రీహాన్ మంచిపాయింట్ లేవ‌దీసాడు. ఇక సూర్యతో తన రిలేషన్ ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని.. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేందుకే అతడిని నామినేట్ చేస్తున్నట్లు ఇనయా చెప్పుకొచ్చింది. ఫైమా పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వడం లేదని మెరీనా ఆరోపించింది. ఇలా హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మ‌ధ్య భీబ‌త్స‌మైన ర‌చ్చ న‌డిచింది. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ అంద‌రిని నామినేట్ చేశారు. మ‌రి నామినేష‌న్స్ నుండి ఎవ‌రు సేవ్ అవుతారో చూడాలి.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News