Homebigg boss telugu season 6Bigg Boss 6: చిచ్చు పెట్టిన బిగ్ బాస్.. మ‌ళ్లీ శ్రీహాన్, కీర్తి మ‌ధ్య గొడ‌వ‌లు

Bigg Boss 6: చిచ్చు పెట్టిన బిగ్ బాస్.. మ‌ళ్లీ శ్రీహాన్, కీర్తి మ‌ధ్య గొడ‌వ‌లు

Telugu Flash News

Bigg Boss 6: బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ఎంత ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం బిగ్ బిస్ హౌజ్‌లో టిక్కెట్ టూ ఫినాలే టాస్క్ జ‌రుగుతుండ‌గా, దీని కోసం హౌజ్‌మేట్స్ శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. ఎవ‌రికి వారు ఆ ట్రోఫీని ద‌క్కించుకోవాల‌ని క‌ష్టప‌డుతున్నారు. ఈ టాస్క్ నుంచి శ్రీసత్య, ఇనయా ఇప్ప‌టికే ఎలిమినేట్ అవ్వగా.. తాజాగా కీర్తీ కూడా కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఈ రేస్ నుంచి ఎలిమినేట్ కావ‌ల‌సి వ‌చ్చింది. అయితే శత్రువులు మిత్రులయ్యారు అనుకున్న టైమ్ కు.. మళ్ళీ చిచ్చు పెట్టాడు బిగ్ బాస్ .

ముఖ్యంగా టాస్క్ విషయంలో… సంచాలక్ గా ఉన్న ఇనయా, శ్రీసత్యలు శ్రీహాన్ కు ఫేవర్ గా ఉన్నారని, శ్రీహాన్ ను విన్నర్ గా ప్రకటించి తనకు అన్యాయంచేశారంటూ కీర్తి ఫుల్ ఫైల‌ర్ అయింది. ఇక ఎలిమినేట్ అయినందుకు చాలా ఏడ్చేసింది. అసలు విషయం మాట్లాడటానికి వచ్చిన శ్రీసత్యతో మాట్లాడటానికి ఇష్టపడలేదు కీర్తి. ఇక ఆతరువాత టాస్క్ లో రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్ పాల్గోనగా.. ఫజిల్ లాంటి గజిబిజి రారులు దాటుకుంటూ.. కోడి గుడ్లను అవతలి టార్గెట్ కు చేర్చాలి అని చెప్పారు బిగ్ బాస్ . ఈ టాస్క్ లో ఆదిరెడ్డి విన్ అయ్యాడు.

దీంతో 12 పాయింట్లతో ఆదిరెడ్డి టికెట్ టూ ఫినాలే రేస్ లో ముందుండగా.. 10 పాయింట్లతో శ్రీహాన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.ఇక తమకు బిగ్ బాస్ ట్రోఫీ ఎంత ఇపార్టెంట్ లో ఎవరికి వారు ఆడియన్స్ కు వివరించమంటూ బిగ్ బాస్ చెప్పగా.. ప్రతీ ఒక్కరూ తమకు ట్రోఫీ ఎంత ఇంపార్టెంటో చెప్పుకొచ్చారు. తన తల్లికి తాను కప్పు గెలిచి రావాలని.. కోరిక అంటూ శ్రీహాన్ ఎమోషనల్ అవ్వగా.. బిగ్ బాస్ విన్నర్ గా తనను అవమానించిన వాళ్ళ ముందు గర్వంగా నిలబడాలి అనకుంటున్నట్టు ఇనయా ఎమోష‌న‌ల్‌గా చెప్పుకొచ్చింది. తాను కప్పు గెలిచి తన తల్లికోసం ఇల్లు కట్టాలి అంటోంది ఫైమ. ఇక ఆదిరెడ్డి తన స్టైల్ లో తాను విన్నర్ ను అవ్వాలి అనుకుంటున్నట్టు చెప్పుకు రాగా, మిగ‌తా వారు కూడా త‌మ‌కు క‌ప్ ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పుకొచ్చారు. .

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News