Telugu Flash News

Bigg Boss 6: గేమ్ లోకి వ‌చ్చిన గీతూ.. రేవంత్‌ని భ‌లే ఇరికించేసిందిగా..!

బిగ్‌బాస్‌ సీజన్ 6 (Bigg Boss 6) లో భాగంగా చేప‌ల చెరువు పేరుతో కెప్టెన్సీ టాస్క్ జ‌రుగుతున్న విష‌యం తెల‌సిందే. ఇందులో కంటెస్టెంట్స్ ఫిజిక‌ల్ గేమ్ ఆడుతూ భ‌య‌బ్రాంతుల‌కి గురి చేస్తున్నారు. ఎప్పుడు ఎత్తుకు పై ఎత్తులు వేసే గీతూ తొలి రౌండ్‌లోనే నిష్క్ర‌మించింది.

అయితే షో చివర్లో హౌస్‌మెట్స్‌కి గలాట గీతు వరుస ట్విస్ట్‌లు ఇచ్చి కెప్టెన్సీ టాస్క్‌ని మరింత ఆసక్తిగా మార్చేసింది. అయితే టాస్క్‌లో ఎవ‌రు త‌గ్గేదే లే అన్న‌ట్టు గేమ్ ఆడారు. బాలాదిత్య ..శ్రీహాన్ -శ్రీసత్యలను వదలకుండా వెంటాడి మరీ వారిస్కోర్ తగ్గించేందుకు ఎంత‌గానో కృషి చేశాడు. అటు సంచాలక్ గా గీతూ కొత్త రూల్స్ పెడుతూ అంద‌రిచేత చీవాట్లు తిన్న‌ది. చివ‌ర‌కు ఆదిరెడ్డి కూడా తిట్టేశాడు.

రేవంత్ ఆమెపై ఫుల్ ఫైర్ కాగా, ఆ స‌మ‌యంలో గీతూ త‌న గేమ్ అంత‌టిని మార్చేసి అంద‌రికి పెద్ద షాకిచ్చింది .

గేమ్ ఆడినవారి చేపలు ఫైనల్ లెక్క చెప్పమని బిగ్ బాస్ అడగ్గా.. లెక్క పెట్టిన గీతూ.. రేవంత్, టీమ్ , రాజ్ టీమ్ ఆతరువాత శ్రీహాన్ టీమ్ కు ఎక్కువగా చేపలు వచ్చాయని చెప్పింది. బాలాధిత్య టీమ్ చివరి పొజిషన్ లో ఉన్నారని పేర్కొంది.

ఇక బిగ్ బాస్ ఇంట్లోకి నల్ల చేప వచ్చింది ఎక్కడ ఉంది అనగా అది గీతూ తీసుకువచ్చి చూపించడంతో అంద‌రు అవాక్క‌య్యారు. ఇక న‌ల్ల‌చేప‌తో స్వైప్ చేయోచ్చు అనే కండీష‌న్ బిగ్ బాస్ పెట్టారు.

దీంతో గీతూ.. రేవంత్- శ్రీహాన్ లను స్వైప్‌ చేస్తున్నట్టు తెలిపింది. ఇంతటో ఆట ముగిసినట్టు బిగ్ బాస్ ప్రకటించారు. ఇన‌య ఆట కొన‌సాగించాల‌ని కోరిన బిగ్ బాస్ స్పందించ‌లేదు.

స్వాప్ తర్వాత గీతు, ఆదిరెడ్డి చెప్పిన లెక్క ప్రకారం తక్కువ చేపలు ఉన్న ఆదిత్య- మెరీనా జంట బిగ్‌బాస్ టాస్క్ నుంచి నిష్క్రమించినట్లు బిగ్‌బాస్ చెప్పడంతో చేపల చెరువు టాస్క్ ముగిసింది.

అయితే గీతూ… రేవంత్ దగ్గర చేపలను తీసుకోవాలి అని రాత్రిళ్లు చాలా ట్రై చేసింది. కాని కుద‌ర‌లేదు. ఇక ఈ రోజు ఆ టాస్క్ పూర్తి కానుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ రోజు కెప్టెన్ ఎవరు అవుతారో తేల‌నుంది.

మరిన్ని చదవండి :

horoscope today : 27-10-2022 గురువారం ఈ రోజు రాశి ఫలాలు

Vitamin B12 deficiency: విటమిన్ B12 లోపం యొక్క లక్షణాలు ఏమిటి? ఎలా చికిత్స చేయాలి? విటమిన్ B12 సమృద్ధిగా ఉన్న ఉత్తమ ఆహారాలు ఏంటి ?

 

 

Exit mobile version