Homebigg boss telugu season 6Bigg Boss 6: ఎలిమినేట్ అయిన చంటి... హౌజ్‌మేట్స్‌పై అలా మాట్లాడాడేంటి?

Bigg Boss 6: ఎలిమినేట్ అయిన చంటి… హౌజ్‌మేట్స్‌పై అలా మాట్లాడాడేంటి?

Telugu Flash News

Bigg Boss 6: బిగ్ బాస్ సీజ‌న్ 6 రంజుగా సాగుతుండ‌గా,హౌజ్‌లో కాస్త అశ్ర‌ద్ధ‌గా వ్య‌వ‌హ‌రించిన వారు ఎలిమినేట్ అయి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో చంటి ఎలిమినేట్ అయ్యాడు. అంత‌క‌ముందు , అభినయశ్రీ, నేహా చౌదరి, ఆరోహి ఎలిమినేట్‌ అయ్యారు.

ఈ సారి ఎలిమినేషన్‌ మాత్రం చాలా ఉత్కంఠంగా సాగింది. చివరగా నామినేషన్‌లో ఇనయ, చంటి ఉండగా ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఉత్కంఠ నెలకొంది. అయితే అంద‌రు అనుకున్న‌ట్టే చంటి ఎలిమినేట్ అయ్యారు. ఇక చంటి హౌజ్‌మేట్స్ గురించి అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

మ‌రో వికెట్ ఔట్

అర్జున్‌, సుదీప, రోహిత్, రాజ్‌, కీర్తిలకు ఫెయిల్‌ మార్కులు(34 అండ్‌ ఆఫ్‌) వేశాడు చంటి. అర్జున్‌ తప్పులను గురించి చెబుతూ గేమ్‌ ఆడుతున్నాడు, కానీ ఎక్కడో రాజీపడుతున్నాడు, అది తగ్గించి గేమ్‌పై ఫోకస్‌ పెట్టాలంటూ సూచ‌న‌లు అందించాడు.

ఇక సుదీప్ కిచెన్‌లో ఎక్కువ ఉంటుంద‌ని, బ‌య‌ట‌కు రావ‌ల్సి ఉంటుంద‌ని అన్నారు. ఇక రోహిత్.. తనలాగే ఉన్నాడని, తాను చేసిన తప్పు చేయోద్దని అన్నారు.. రాజ్‌ అందరిని నమ్ముతాడని, తాను అనుకున్న సరిగా ఎక్స్ ప్రెస్‌ చేయలేకపోతున్నాడని సూచించాడు. కీర్తి గ‌తం మ‌రచిపోయి గేమ్ ఆడాల‌ని అన్నాడు.

ఇక సూర్య, శ్రీహాన్‌, ఫైమా, మరీనా, రేవంత్‌లకు టాప్‌ మార్కులిచ్చాడు చ‌లాకి చంటి. సూర్య ఎక్కువగా ప్రేమిస్తుంటాడని, అది మానేసి ఆటపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. శ్రీహాన్‌ చాలా క్లారిటీ ఉన్న కంటెస్టెంట్‌ అని, ఫైమా అందరిని నవ్విస్తుందని చెప్పుకొచ్చాడు .

మరీనా మదర్ ఇండియా అని, ఆమె ప్రాబ్లెమ్‌ రోహిత్‌ అని తెలిపాడు. ఆదిరెడ్డి, గీతూలకు 90మార్కులిచ్చాడు. గీతూ, రేవంత్‌, కీర్తిలకు సలహాలిస్తూ, బాలాదిత్యపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మంచితనం మేకప్‌ అని చెప్ప‌డంతో అంద‌రు ఆశ్చ‌ర్యానికి గురయ్యారు.ఇక అంతకు ముందు షోకి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ గెస్ట్ గా వచ్చాడు. ఆయ‌న తెగ సంద‌డి చేశాడు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News