Telugu Flash News

Bigg Boss 6 : కెప్టెన్సీ టాస్క్ లో మ‌రీ ఇంత అగ్రెసివ్ అయిపోయారేంటి…!

bigg boss telugu 6

Bigg Boss 6 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతున్న విష‌యం తెలిసిందే. మంగ‌ళవారం నుండి కెప్టెన్సీ టాస్క్ న‌డుస్తుంది. నాగమణులను లాక్కోవడం, కాపాడుకోవడానికి సంబంధించిన టాస్క్ ప్ర‌స్తుతం న‌డుస్తుండ‌గా, పాముల టీమ్‌ శ్రీహాన్‌, కీర్తి,ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్‌లు చాలా విరోచితంగా పోరాడారు. వీరిని అడ్డుకునేందుకు నిచ్చెన టీమ్‌ రేవంత్‌, బాలాదిత్య, మెరినా, రాజ్‌, శ్రీ సత్యలు కూడా శ‌క్తివంచ‌న లేకుండా ప్రయత్నించారు. అయితే 66వ ఎపిసోడ్‌లో రాత్రి సమయంలో చిట్‌ చాట్‌ ఆద్యంతం రసవత్తరంగా సాగింది.

భ‌య‌పెట్టిస్తున్నారు..

ఇనయ, కీర్తిలు టాస్క్ విషయంలో జ‌రిగిన‌వి త‌ల‌చుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు వాసంతి సైతం నేను పొగరు చూపించిందని అంటున్నారని రేవంత్‌ వద్ద వాపోయింది. ఫైమానేమో నాపైనే కన్నేసిందంటూ తన ఆవేదనని పంచుకుంది. అనంతరం కెప్టెన్నీ పోటీదారుల టాస్క్ లో స్లిప్‌లను మరొకరికి అంటించాల్సి ఉంటుందని చెప్పారు. ఇందులో ఇనయ, వాసంతి ఔట్‌ అయ్యారు. రోహిత్‌, శ్రీసత్య మిగల‌డంతో వారికి మ‌రో గేమ్ ఇయ్యారు. పాముల టీమ్‌, నిచ్చెన టీమ్ ని విడగొట్టి వారి మధ్య `నాగమణుల` టాస్క్ ఇవ్వ‌గా, ఇందులో పాముల టీమ్‌ నాగమణులను గుంజుకోవాల్సి ఉంటుంద‌ని అన్నారు బిగ్ బాస్.

నిచ్చెన టీమ్ నాగ‌మ‌ణుల‌ని కాపాడుకోవ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డారు. అయితే ఇందులో రేవంత్‌ ఫిజికల్‌ అవుతున్నాడని, ఆదిరెడ్డి పడే పడే వాదించడంతో రేవంత్‌ హర్ట్ అవుతూ, తాను ఫిజికల్‌ కానని వెల్లడించారు. అయితే ఈ క్రమంలో ఇతర కంటెస్టెంట్లు తన వీక్‌నెస్‌ని వాడుకుని తనని కంట్రోల్‌చేస్తున్నారంటూ కొంత ఎమోష‌న‌ల్ అయ్యాడు రేవంత్‌.ఇ క ఈ టాస్క్ లో పాముల టీమ్ ఏకంగా 517 నాగమణుల‌ని పొంది గెలిచింది. నిచ్చెన టీమ్‌కి కేవలం 497 నాగమణులు ఉన్నాయి. ఇక ఈ వారం కెప్టెన్సీ కోసం శ్రీ సత్య, కీర్తి, ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్ ఉన్నారు. వీరితోపాటు గోల్డెన్‌ నాగమణి ఉన్న మెరినా కూడా కెప్టెన్సీ పోటీదారుల జాబితాలో చేరిపోయింది. మ‌రి ఇందులో ఎవరు గెలిచి కెప్టెన్ అవుతారో చూడాలి.

also read news:

horoscope today : 10-11-2022 గురువారం రాశి ఫలాలు చూడండి

జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యా రావు ఎవరు..ఆమె వివరాలు మీ కోసం

 

Exit mobile version