Katrina Kaif: బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లపాటు విక్కీ కౌశల్ తో ప్రేమాయణం సాగించింది. ఎట్టకేలకు 2021, డిసెంబరు 9న కత్రినా కైఫ్, హీరో విక్కీ కౌశల్ అఫీషియల్‌గా పెళ్లి చేసుకున్నారు.
అయితే అట్టహాసంగా జరుగుతున్న పెళ్లిలో పెద్ద గొడవ జరిగిందట. ఒక్కసారిగా పెద్ద శబ్ధాలు రావడంతో పెళ్లి పీటలపై నుంచే తాను వెనుదిరిగి చూశానని.. అప్పటికే అక్కడ పెద్ద గొడవ జరుగుతుండటంతో షాక్‌కి గురయ్యాను అంటూ అప్పటి సంగతులని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంది కత్రినా.
ఎందుకంత గొడవ..
కత్రినా, విక్కీ కౌశల్ వివాహానికి సెలెబ్రిటీలతో పాటు పరిమిత సంఖ్యలో బంధువులు, అతిథుల్ని మాత్రమే అనుమతించారు. కానీ సంతోషంగా జరుగుతున్న వివాహంలో ఒక్కసారి అలజడి రేగిందట. ‘‘పెళ్లి పీటలపై కూర్చుని అతిథుల వైపు చూస్తున్నా. కానీ సడన్‌గా నా వెనుక నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వినబడ్డాయి. దాంతో ఏం జరిగింది? అని వెనక్కి తిరిగి చూడగా, అక్కడ నా సిస్టర్స్, విక్కీ కౌశల్ ఫ్రెండ్స్ గొడవ పడుతున్నారు. వారి గొడవ ఏ స్థాయికి చేరిందంటే? చివరికి కుర్చీలు, చెప్పుల్ని ఒకరిపై మరొకరు విసురుకుని తిట్టుకునేంత వరకు.
అయితే ఆ పరిస్థితులలోనేను అక్కడకి వెళ్లలేకపోయాను. గొడవలో ఎవరు గెలిచారో కూడా అడగడం కూడా మరచిపోయాను అంటూ కత్రినా నవ్వుతూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కత్రినా కైఫ్ మేరీ క్రిస్మస్, టైగర్ 3 సి నిమాల్లో నటిస్తోంది. ఆమె భర్త విక్కీ కౌశల్ సామ్ బహదూర్, గోవిందా నామ్ మేరా సినిమాలతో బిజీగా ఉన్నాడు.
అయితే కత్రినా తన భర్తతో కలసి ఆనందంగా గడిపే క్షణాలని అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వస్తుంది. ఇటీవల కర్వా చౌత్ వేడుకలను అత్తవారింట్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘తొలి కర్వా చౌత్’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.. ఫొటోల్లో ఈ జంట సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించారు