బిగ్ బాస్ సీజన్ 6 (bigg boss telugu 6) లో కంటెస్టెంట్స్ ఇప్పుడిప్పుడే గేమ్ మోడ్ లోకి వస్తున్నారు. బిగ్ బాస్ గడ్డిపెట్టి, కడుపు మాడిస్తే కాని వారిలోని ఆట బయటకు రావడం లేదు. ఇక గేమ్ ఆడుతున్నారు కాని , కొందరు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ చేత ఒక ప్రతిజ్ఞ చేయించారు.
హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరు మా ఆట తీరు మార్చుకుంటాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. గీతూ మాత్రం తనదైన శైలిలో ప్రతిజ్ఞ చేసి ఏందిరి సామి అనేలా చేసింది. ఇక బిగ్ బాస్ హౌజ్‌మేట్స్‌కి టాస్క్ ఇవ్వగా, ఈ టాస్క్ లో రెడ్ అండ్ బ్లూ టీమ్స్ తలపడతాయి. టాస్క్ ప్రకారం ఒక మెషిన్ లో నుంచి బొమ్మల పూలు బయటకు వస్తుండగా, ఇరు టీములు ఆ పూలని బొమ్మలని పోటీపడి దక్కించుకోవల్సి ఉంటుంది.
బిగ్ ఫైట్..
దక్కించుకున్నవాటిని వారి ప్లేస్ లలో ఉంచుకోవాలి అని బిగ్ బాస్ చెప్పారు. అయితే పూలు దక్కించుకునేందుకు అందరు మెషిన్ వద్దే ఉండిపోవడంతో గందరగోళం ఏర్పడింది.ఈ టాస్క్ ఫిజికల్‌గా మారింది.టాస్క్‌లో భాగంగా శ్రీహన్, అర్జున్ కళ్యాణ్ మధ్య గొడవ జరిగింది.
అర్జున్ కళ్యాణ్.. శ్రీహాన్ ని మెషిన్ వద్ద నుంచి లాగేసేందుకు ప్రయత్నించగా.. శ్రీహన్ కూడా అలాగే స్పందించాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగగా, శ్రీహన్ తొడ కొడుతూ రెచ్చిపోయాడు. తాను ఇద్దరిని లాగాను అని, అది తన దమ్ము అంటూ శ్రీహాన్ గట్టిగా అరుస్తూ చెప్పాడు..
ఇక శ్రీహన్ తో మెరీనాకి కూడా గొడవ అయింది. టాస్క్‌లో భాగంగా … రేవంత్, శ్రీ సత్య మధ్య చిన్నపాటి మాటల యుద్ధం సాగింది. అయితే అర్జున్ కళ్యాణ్, శ్రీహాన్, రేవంత్, సూర్య , కీర్తి, వాసంతి లాంటి వారంతా మెషిన్ కి దగ్గరగా ఉండి దెబ్బలు తగులుతున్నా పట్టించుకోకుండా టాస్క్ ఆడడం ప్రేక్షకులని ఆకట్టుకుంది.
ఇలా గేమ్ ఆసక్తికరంగా సాగుతున్ననేపథ్యంలో చివరకి తొలి రౌండ్ లో రెడ్ టీం విజయం సాధించింది. తదుపరి రౌండ్స్ నేడు కొనసాగుతాయి.ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ టాస్క్ లో విజయం సాధించిన టీం నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు. పరాజయం చెందిన టీమ్ లో ఒక సభ్యుడు నేరుగా నామినేట్ అవుతారట.
ఇవి కూడా చూడండి :