Homebigg boss telugu season 6Bigg Boss 6: ఎర్ర‌గ‌డ్డ‌లో మాదిరిగా అర‌చుకున్న హౌజ్‌మేట్స్.. స‌హ‌నం కోల్పోతున్న ఆడియ‌న్స్

Bigg Boss 6: ఎర్ర‌గ‌డ్డ‌లో మాదిరిగా అర‌చుకున్న హౌజ్‌మేట్స్.. స‌హ‌నం కోల్పోతున్న ఆడియ‌న్స్

Telugu Flash News

Bigg Boss 6: బుల్లితెర ప్రేక్షకుల‌కి మంచి వినోదాన్ని పంచే బిగ్ బాస్ షో రోజురోజుకి చాలా వ‌యెలెంట్‌గా మారుతుంది.ప‌లు టాస్క్‌లలో వారు దారుణంగా పోట్లాడుతున్నారు. కెప్టెన్సీ టాస్క్ కోసం కొద్ది రోజులుగా ఫైట్ న‌డుస్తుండ‌గా, ఈ ఫైట్ లో శ్రీహాన్, గీతు, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్యలు కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక అయ్యారు.

ఇక ఆ త‌ర్వాత బ్రిక్స్ టాస్క్ ఇవ్వ‌గా అది ర‌చ్చ‌గా మారింది. ఫైమాకి స‌పోర్ట్‌గా ఉన్న ఇన‌య ఆమె కోసం గ‌ట్టిగా ఫైట్ చేసింది. శ్రీహాన్‌కి కూడా బ్రిక్స్ త‌గిలిన ఎందుకు డిస్‌క్వాలిఫై చేయ‌లేదు అని గ‌గ్గోలు పెట్టింది. దీంతో శ్రీహాన్ .. ‘ఏ పిట్ట వచ్చి నీ దగ్గర ఏం కూసినా.. సంచాలక్‌గా నీ నిర్ణయం నువ్ తీసుకో’ అని చెప్ప‌డంతో ఇన‌య రెచ్చిపోయింది.

ర‌ణ‌రంగంగా మారిన బిగ్ బాస్ హౌజ్

నిజానికి ఈ కెప్టెన్సీ టాస్క్‌లో దొంగల టీంలో ఇనయ శక్తికి మించి ఆడిన ఆమెకు హౌజ్‌లో స‌రైన స‌పోర్ట్ లేని కార‌ణంగా కంటెండ‌ర్ టాస్క్‌కి ఎంపిక కాలేక‌పోయింది. ఓటింగ్ ప్రకారం ఫైమాకి ఎక్కువ మద్దతు ల‌భించ‌డంతో ఆమె కెప్టెన్సీ కంటెండర్ కాలేకపోయింది.

ఇనయ చిప్ దొబ్బిందని.. హౌస్‌లో ఉన్న ఆమె వ్యతిరేక వర్గం.. ఆదిరెడ్డి, గీతు, నేహా, ఆర్జే సూర్యలు ముచ్చటించుకున్నారు. శ్రీహాన్‌ని మగాడివైతే.. అంటూ ఇన‌య‌ నోరు జార‌గా, దీనిపై కూడా కాసేపు చ‌ర్చ న‌డిచింది.

ఇక రేవంత్ ఎప్ప‌టి మాదిరిగానే ర‌చ్చకు దిగాడు. తాను కెప్టెన్ అయ్యాక కిచెన్ టీమ్ అందరిని పక్కకు నెట్టేస్తానంటూ ఏవేవో కామెంట్స్ చేశాడు.

ఇక కెప్టెన్ రాజ్ తను అస్సలు పెళ్ళి చేసుకోవద్దు అనుకున్నానని..కాని హౌస్ లోకి వచ్చిన తరువాత ఇక్కడ కపుల్స్ ను చూసి తాను పెళ్ళి చేసుకోవాల‌నే కోరిక క‌లిగింద‌ని చెప్పుకొచ్చాడు.

-Advertisement-

ఇక నేహా ..రాజ్ ను ఒక ఆట ఆడకుంది. కొంత ర‌చ్చ‌గా మారిన బిగ్ బాస్ ఆ త‌ర్వాత సందడిగానే సాగింది. అయితే బిగ్ బాస్ కెప్టెన్ ఎవ‌రు అన్న‌ది నేటి ఎపిసోడ్‌లో తేల‌నుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News