Bhola Shankar movie review
భోళా శంకర్ కథ ఏంటంటే ?
‘భోళా శంకర్’ కలకత్తాలో టాక్సీ డ్రైవర్ గా పని చేస్తుంటాడు . తన చెల్లెలు కీర్తి సురేష్ ను చదివించి మంచి భవిష్యత్తును అందించాలని కోరుకుంటాడు . అదే సందర్భంలో శంకర్‌కి సామాజిక బాధ్యత కూడా చాలా ఎక్కువ. అన్యాయాన్ని సహించడు. ఆపదలో ఉన్న అమ్మాయిలను శంకర్ రక్షిస్తుంటాడు . కలకత్తా నగరంలో పెరుగుతున్న మహిళల మిస్సింగ్ కేసులు మానవ అక్రమ రవాణా కేసులను ఛేదించడంలో శంకర్ పోలీసులకు సహాయం చేస్తాడు. ఈ పరిస్థితుల మధ్య శంకర్ చెల్లెలు చిక్కుల్లో పడుతుంది. శంకర్ తన సొంత సోదరుడు కాదని తెలుసుకుంటుంది? అసలు ఈ భోళా శంకర్ ఎవరు? అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది మిగతా కథ.
భోళా శంకర్ మూవీ ఎలా ఉందంటే ?
మెగాస్టార్ చిరంజీవి ఫాన్స్ కి నచ్చే సినిమా అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది. మరోవైపు సెకండాఫ్‌లో చిరు ఎంట్రీ బాగుంది. అంతేకాదు కోల్ కత్తా సెంటిమెంట్ మెగా ఫ్యామిలీని మరోసారి కలిసి వచ్చింది. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్. మొత్తానికి సినిమా మాస్ మసాలా మరియు మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు.
అంతేకాదు చిరు, కీర్తి సురేష్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. మెగాస్టార్ తనదైన శైలిలో కామెడీ, డైలాగ్స్, యాక్షన్, సెంటిమెంట్ లను తీర్చిదిద్దారు.చిరు భోళాశంకర్ కి పాజిటివ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయం. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాత. ఈ సినిమాలో తులసి, రఘుబాబు, రావు రమేష్, ఉత్విక్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా అజిత్ నటించిన తమిళ సినిమా వేదాళం కి రీమేక్.
భోళా శంకర్ మూవీ రేటింగ్ : 3/5.
also read :
jailer telugu movie review : ‘జైలర్’ తెలుగు మూవీ రివ్యూ