Telugu Flash News

Bhagavanth Kesari Teaser : 👌తెలంగాణ యాసలో అదరగొట్టిన బాలయ్య😎.. ‘భగవంత్ కేసరి’ టీజర్ సూపర్బ్..

BhagavanthKesari Teaser

BhagavanthKesari Teaser

Nandamuri Balakrishna, Anil Ravipudi latest movie Bhagavanth Kesari Teaser Released

బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ కథ మాస్ యాక్షన్ జానర్‌లో సాగుతుంది. సాహు గారపాటి – హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్‌పై బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోజు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి ఫస్ట్ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో బాలకృష్ణ తన గురించి ‘అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్ కేసరి’ అంటూ యాక్షన్‌లోకి దిగారు. ‘ఈ పేరు చానా యేండ్లు యాదుంటది’ అనే డైలాగ్ తో బాలయ్య ముగించారు. ఈ సినిమా తెలంగాణ యాసలో ఉంటుందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది.

బాలకృష్ణ సరసన కాజల్ కథానాయికగా కనిపించనుంది. ఆయన కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తోంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో కథ మొత్తం సాగుతుంది. శ్రీలీల తన పాత్రకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అంగీకరించినట్లు సమాచారం. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ‘దసరా’కి విడుదల కానుంది.

 

Exit mobile version