Homewomenమీ డైనింగ్ రూమ్ ని ఇలా ముస్తాబు చేయండి ..చూస్తే ఆకలి వెయ్యాలి మరి!

మీ డైనింగ్ రూమ్ ని ఇలా ముస్తాబు చేయండి ..చూస్తే ఆకలి వెయ్యాలి మరి!

Telugu Flash News

మీ డైనింగ్ రూమ్ ని ఇలా అందంగా డెకరేట్ చేయండి ..ఈ క్రింద తెలిపిన కొన్ని పద్దతులు పాటించండి చాలు..!

  1. డైనింగ్ రూమ్ కి డైనింగ్ టేబుల్ ముఖ్యం. విడిగా గది ఉన్న వాళ్ళు మధ్యలో టేబుల్ ను వేసుకోవచ్చు. స్థలం కలిసి రావాలంటే గోడ ప్రక్కగా వేసుకోవాలి.best dining room decorating ideas
  2. గోడకు పండ్లు, కూరగాయలు ఉన్న సీనరీని అతికించండి. ఆ రూమ్ కే అందం వస్తుంది.
  3. డైనింగ్ టేబుల్ సైజును బట్టి చిన్నదైనా,పెద్దదైనా తాజా పూలతో ఒక ఫ్లవర్ వాజ్ ను పెట్టుకోవాలి. ఫ్లోటింగ్ అరేంజ్ మెంట్ చేస్తే డైనింగ్ టేబుల్ కే అందం వస్తుంది.best dining room decorating ideas
  4. డైనింగ్ టేబుల్ మీద డిమ్ లైట్ అరేంజ్ చేసుకుంటే మూన్ లైట్ డిన్నర్ చేసినట్లుంటుంది.
  5. అలమారాలో జ్యూస్ సెట్, టీసెట్, టిఫిన్ ప్లేట్స్ పింగాణీవి అమర్చుకోవాలి. వీటిని కొందరు హాలులో అలంకార వస్తువులుగా పెడతారు. వీటికి అనువైన స్థలం డైనింగ్ రూమ్ మాత్రమే అని గుర్తించాలి.best dining room decorating ideas
  6. ఓ ప్రక్కగా సింక్, దాని ప్రక్కన హోల్డర్, అందులో రోజూ తాజా నాప్ కిస్ పెట్టడం మరచిపోకూడదు. సింక్ పైన మిర్రర్ కూడా ఉండాలండీ !
  7. ప్లాస్టిక్ అరిటాకులు దొరుకుతున్నాయి. వాటిని వాడితే అందం, ఆనందం కూడా !
  8. పచ్చడుల కంటైనర్, సాల్ట్, పెప్పర్ స్టాండు లేకపోతే టేబుల్ కి అందం రాదండీ ! ఆకలి వేస్తోందంటున్నారా ! ఇంకెందుకు ఆలస్యం ! కానివ్వండి !డైనింగ్ రూమ్

మీ బెడ్‌ రూమ్ ను అందంగా ఇలా అలంకరించుకోండి..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News