Aloe Vera: కలబంద లేదా అలోవేరా ఇది మన ఇంటి పరిసరాలలో లభిస్తుంది. దీని వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కలబంద ఆరోగ్యపరంగానే కాకుండా సౌందర్య పరంగా కూడా చక్కని పరిష్కారంగా ఉంటుంది. కలబంద అందించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద రసాన్ని తాగితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వివిధ రకాల విటమిన్లతో నిండి ఉంటుంది. అదనంగా, ఇది చాలా ఖనిజాలు కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి ఈ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తాగడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయి.
సర్వరోగ నివారణిగా అలోవేరా..
కలబంద ని ఔషధాల తయారీలో కూడా వాడుతారు. కాలిన గాయాలకు కలబందను తప్పక ఉపయోగిస్తారు. ప్రాచీన కాలంనుంచి కలబందని పలు రకాలుగా వాడుతున్నారు. అయితే పరగడుపున ఒక గ్లాస్ కలబంద జ్యూస్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
తలనొప్పితో బాధపడేవారికి కలబంధ దివ్య ఔషదం లాంటిది. పరిగడపున కలబంద రసం తాగితే చాలా రకాల తలనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు పరగడుపున కలబంద జ్యూస్ తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక మన శరీరంలో ఉండే విషపూరిత పదార్ధాలని కూడా కలబంద రసం బయటకు పంపుతుంది.
షుగర్ వ్యాధి గ్రస్తులకు అయితే కలబంద రసం దివ్యౌషధంలా పని చేస్తుంది. ఇది చక్కెర లెవల్స్‌ని అదుపులోకి తెస్తుంది. అంతేకాక దంతాలు, చిగుళ్ల సమస్యలతో బాధపడుతున్న వారు కలబందను నిత్యం తీసుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది. ఈ రసం వలన కీళ్ల నొప్పలు తగ్గుతాయి.
శరీరానికి కావాల్సిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.కలబంద గుజ్జును గాయాలపై రాస్తే త్వరగా తగ్గుతాయి. తరచూ విరేచనాల సమస్యతో బాధడేవారు క్రమం తప్పకుండా కలబంద గుజ్జును తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. రోజూ ఖాళీ కడుపుతో కలబంద రసం తాగడం వల్ల దంతాల, చిగుళ్ల సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.