Telugu Flash News

రావి ఆకులతో ఈ రోగాలు దూరం.. ప్రయోజనాలివే..

హిందువులు దేవతగా భావించి కొలిచే వృక్షాల్లో రావి చెట్టు ఒకటి. రావిచెట్టుకు పూజలు చేస్తుంటారు. ఈ చెట్టు అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. రావి ఆకులు, కాయలు, బెరడుకు అనేక రోగాలు తగ్గించే శక్తి ఉంటుంది.

1. రావిచెట్టు ఆకులు మలబద్ధకం, విరోచనాలు, రక్త సంబంధిత వ్యాధులను నయం చేస్తాయి.

2. గ్లూకోజ్‌, ఆస్టియాయిడ్‌, ఫినాలిక్‌ లక్షణాలు రావి ఆకుల్లో ఉంటాయి. రావిచెట్టులోని ప్రతి భాగం వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది.

3. రావి ఆకుల లక్షణాలు దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

4. రావి ఆకుల రసం తాగితే మ్యూకస్‌ సమస్య తగ్గుముఖం పడుతుంది.

5. ఊపిరితిత్తులను శుభ్రం చేయడానికి రావి ఆకుల రసం తాగితే మంచి ఫలితాలు వస్తాయి. శ్వాస సమస్యలు తగ్గుతాయి.

6. డిటాక్స్‌ డ్రింక్‌గా కూడా రావి ఆకుల రసం తాగవచ్చు. రక్తంలో మలినాలుంటే శుద్ధి చేస్తుంది.

7. చిగుళ్లు, దంతాలకు రావి ఆకుల రసం మేలు చేస్తుంది. నోట్లో బ్యాక్టీరియాలు నాశనమవుతాయి.

also read :

Gautam Adani : అదానీ పతనం ఎక్కడిదాకా? బిలియనీర్ల లిస్టులో 22వ ప్లేస్‌కు పడిపోయిన గౌతమ్‌ అదానీ

Pawan Kalyan: మూడు పెళ్లిళ్లు చేసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్ర‌హ్మ‌చారిగా ఉండాల‌నుకున్నాడా..!

Exit mobile version