Telugu Flash News

Finger millet : ఊబ‌కాయులు బ‌రువు త‌గ్గేందుకు రాగులు ఎంత‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయో తెలుసా?

Finger millet : మ‌న‌కు చ‌వ‌క‌గా దొర‌క‌డంతో పాటు ఎన్నో పోషకాలు క‌లిగి ఉండే వాటిలో రాగులు కూడా ఒక‌టి. ఇంగ్లీషులో వీటిని ఫింగర్ మిల్లెట్స్ అంటారు. పీచు పదార్థం (ఫైబర్) అత్యధికంగా ఉండే రాగులను ఆహారంలో భాగంగా తీసుకుంటే చాలా మంచిద‌ని వైద్యులు చెబుతుంటారు.

రాగులతో జావ, సంగటి, బూరెలు, బిస్కెట్లు తదితర రుచికరమైన ఆహార పదార్థాలు తయారుచేసుకోవచ్చు. రాగులను అన్ని వయసుల వారు తీసుకోవచ్చు. వీటితో రుచిక‌ర‌మైన వంట‌కాలు చేసుకోవ‌డంతో పాటు శ‌రీరానికి కావ‌ల‌సిన పోష‌కాలు పెంపొందించుకోవ‌చ్చు.

రాగులతో చాలా ప్ర‌యోజ‌నాలు..

రాగుల‌లోని ఫైటోకెమికల్స్ జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. తద్వారా రక్తంలోకి గ్లూకోజ్ నిదానంగా విడుదలవుతుంది. ఆ విధంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి. రాగులలో అధిక శాతం ఫైబర్ ఉండం వ‌ల‌న జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారికి రాగులు చాలా మంచి ఆహారం. పులియబెట్టిన / తడి రాగులులోని స్టాటిన్ మరియు డైటరీ స్టెరాల్ వంటి ప్రధాన జీవక్రియలు చెడు కొలెస్ట్రాల్‌ను నిరోధించే ఎంజైమ్‌లుగా పనిచేస్తాయి.

కొన్ని అధ్యయనాలు చూపినట్లుగా, రాగులు అధిక పాలీఫెనోలిక్ శాతం కారణంగా సమర్థవంతమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలను ప్రదర్శిస్తాయ‌ని చెబుతున్నారు.

రాగులు యొక్క పై పొరలలో ఫినోలిక్ యాసిడ్, టానిన్స్ మరియు ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, ఇవి బలమైన యాంటీ ఆక్సిడెంట్ చర్యను కలిగి ఉంటాయి.ఇవి క్యాన్స‌ర్‌ని నివారించ‌డానికి ఉప‌యోగ‌ప‌డతాయి.

రాగులు ఎముకల కోసం, బరువు కోల్పోయేందుకు . చక్కెరవ్యాధికి , రక్తహీనతతో పాటు ఇత‌ర స‌మ‌స్య‌ల‌కు కూడా ఇవి చ‌క్క‌గా ప‌ని చేస్తాయి.రాగులలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, అయోడిన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

వీటితోపాటు యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రాగులను తీసుకుంటే జీర్ణం సులభంగా అవుతుంది. శారీరకశ్రమ చేసేవారు రాగులను ఎక్కువగా తీసుకుంటారు.

Exit mobile version