HomesportsT20 world cup: అప్పుడు విల‌న్.. ఇప్పుడు హీరో.. ఛాంపియన్ దక్కించుకున్న‌ ప్రైజ్‌మనీ ఎంతంటే..!

T20 world cup: అప్పుడు విల‌న్.. ఇప్పుడు హీరో.. ఛాంపియన్ దక్కించుకున్న‌ ప్రైజ్‌మనీ ఎంతంటే..!

Telugu Flash News

T20 world cup: ఎట్ట‌కేల‌కు ఆస‌క్తిక‌రంగా సాగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2022 స‌మ‌రం ముగిసింది. విశ్వ విజేత‌గా ఇంగ్లండ్ నిలిచింది. ఫైనల్లో సమష్టిగా రాణించిన నేప‌థ్యంలో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేయ‌గా, పాక్ బ్యాట్స్‌మెన్స్ లో షాన్ మసూద్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 38), బాబర్ ఆజామ్(28 బంతుల్లో 2 ఫోర్లతో 32), షాదాబ్ ఖాన్(14 బంతుల్లో 2 ఫోర్లతో 20) కొంత చెప్పుకోద‌గ్గ స్కోర్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లకు తోడుగా.. ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు తీసారు. బెన్ స్టోక్స్‌కు ఓ వికెట్ దక్కించుకున్నాడు.

నాడు జీరో.. నేడు హీరో

138 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ కూడా ప‌రుగులు చేయ‌డానికి చాల క‌ష్ట‌ప‌డింది. బెన్ స్టోక్స్‌(52 నాటౌట్)కు అండగా జోస్ బట్లర్(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26), మొయిన్ అలీ(12 బంతుల్లో 3 ఫోర్లతో 19) రాణించడంతో విజ‌యం సాధించింది. అయితే కీలక సమయంలో షాహిన్ షా అఫ్రిది గాయపడటం పాక్ విజయవకాశాలను దెబ్బతినేలా చేసింది. ఇదిలా ఉంటే బెన్ స్టోక్స్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడ‌నే చెప్పాలి.

2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్‌తో ఇంగ్లండ్ తలపడగా, చివరి ఓవర్‌లో 19 పరుగులు కావాలి. ఆ స‌మ‌యంలో కార్లోస్ బ్రాత్ వైట్(10 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో వరుసగా 4 సిక్స్‌లు బాది విజయాన్నిఇంగ్లండ్ కి ద‌క్క‌కుండా చేశాడు. 6 బంతుల్లో 19 పరుగులు డిఫెండ్ చేయకపోవడాన్ని తప్పుబడుతూ స్టోక్స్‌పై విమర్శల వర్షం కురిసింది. మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆయ‌న‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు తాజాగా జ‌రిగిన టీ20లో స్టోక్స్ మంచి ఇన్నింగ్స్ ఆడ‌డంతో ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. విధి ఇలానే ఉంటుంద‌ని కొంద‌రు అంటున్నారు. టీ20 ప్రపంచకప్‌ విజేత ఇంగ్లండ్‌కు ప్రైజ్‌మనీ రూపంలో 1.6 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు 13 కోట్ల రూపాయలు) లభించ‌గా, రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్‌కు 8,00,000 డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు 6.5 కోట్లు) దక్కింది. భారత్‌, న్యూజిలాండ్‌కు 4,00,000 డాలర్ల ( సుమారు రూ.3.25 కోట్లు) చొప్పున అందించారు.

also read news: 

Children’s Day : మీ పిల్లలకు ఈ నాలుగు బహుమతులు ఇవ్వండి

-Advertisement-

Nargis Dutt : అలనాటి అందాల నటి నర్గీస్ గురించి మీకేం తెలుసు ?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News