Telugu Flash News

Bala Krishna: తార‌క‌ర‌త్న భౌతిక కాయం వ‌ద్ద బాల‌య్య‌కు వార్నింగ్ ఇచ్చిన పిచ్చోడు

beggar gives warning to balakrishna

Bala Krishna: సోమ‌వారం తార‌క‌ర‌త్న అంత్య‌క్రియలు పూర్తి కాగా, వేలాది మంది ప్ర‌జ‌లు ఆయ‌నకు క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. అయితే అంత్య‌క్రియ‌ల‌కి ముందు ఫిలిం ఛాంబ‌ర్‌లో తార‌క‌ర‌త్న భౌతిక కాయాన్ని అభిమానుల సంద‌ర్శ‌నానికి ఉంచారు. అంద‌రు అక్క‌డికి వ‌చ్చి నివాళులు అర్పిస్తున్న స‌మ‌యంలో చిరిగిన బట్టలు, మాసిన గడ్డంతో ఉన్న ఓ పిచ్చివాడు అక్కడికి దూసుకొచ్చి ముందుగా తారకరత్నకు నివాళి అర్పించాడు.

అనంతరం అక్క‌డే ఉన్న బాలకృష్ణ దగ్గరికి వెళ్లి మాట్లాడాడు. వేలెత్తి చూపుతూ, నొసటిపై గీసుకుంటూ నువ్వు జాగ్రత్తగా ఉండాలని, ఏదో జరగబోతోందని హెచ్చరిక‌లు జారీ చేశాడు. ఆ వ్యక్తి చెప్తున్న మాటలను బాలయ్య శ్రద్ధగా విన్నారు .

అయితే.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆ మతిస్థిమితంలేని వ్యక్తిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అత‌ను ఎవ‌రు అని ఆరాలు తీస్తే అత‌ను ఫిలింన‌గ‌ర్‌లో తిరిగే పిచ్చివాడ‌ని, ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం తిరిగేవాడని అక్క‌డి స్థానికులు చెప్పారు.

అయితే అచ్చం సినిమాల్లో మాదిరిగానే… ఓ పిచ్చోడు అక్క‌డికి రావ‌డం, బాలయ్యను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించటం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

also read :

TSRTC : వేసవి కాలంలో చల్లటి కబురు.. టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు వచ్చేస్తున్నాయ్‌!

YSRCP MLC Candidates: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. మరోసారి సామాజిక బాణం వదిలిన జగన్‌!

 

Exit mobile version