బెడ్ రూమ్ లోకి అడుగు పెడుతున్నామంటే మరో లోకంలోకి ప్రవేశించినట్లే ఉండాలి. చూడగానే బెడ్ ఆహ్వానించాలి. నిద్రజోల పాట పాడాలి. మనసు హాయిగా ప్రేమయాత్రలకు..ఎక్కడికో వెళ్ళటం ఎందుకు బెడ్ రూమ్ బృందావనమైతే బాగుంటుంది కదా !
- బెడ్ రూమ్ కదా అని బెడ్ ను గది మధ్యలో వేయకండి. ఎప్పుడూ బెడ్ కిటి కీ ప్రక్కగా ఉండాలి. చల్లని గాలి పలకరిస్తూ ఉండాలి.
- ఆ కిటికీ దగ్గర నైట్ క్వీన్ ప్లాంట్ ను బయట పాకించారనుకోండి. పరిమళాలే !
- గోడకి సముద్రం ఉన్నట్లు పెయింట్ చేయించు కున్నారనుకోండి. సముద్రం ప్రక్కన ఉన్నట్లు అనిపిస్తుంది.
- మీకు నీలాకాశం ఇష్టం అనుకోండి. ఆకాశాన్ని మన బెడ్ రూమ్ లోకి తెచ్చుకోవచ్చు. అలా తయారు చేసేవాళ్ళున్నారు. లైట్ ఆర్పితే నెలవంక, చుక్కలు ప్రత్యక్ష ఆకాశాన్ని చూస్తూ హాయిగా నిద్రపోవచ్చు.
- సెల్ఫ్ లో పుస్తకాలు నిద్ర రాకపోతే చదువుకోవటానికి అనువుగా సర్దుకోవాలి.
- టేబుల్ లైట్, రాత్రి పూట సన్నగా అది విరజిమ్మే కాంతుల అందమే వేరు.
- డ్రస్సింగ్ టేబుల్ ఒక వైపు ఉంటే,బాగుంటుంది. లేదంటే బీరువాకి నిలువెత్తు ‘అద్దం’ పెట్టించుకోండి.
- ప్రణయానికి ప్రతిరూపమైన రాధాకృష్ణులని వాల్ హేంగింగ్ గా తగిలించండి.
- మ్యాచింగ్ పిల్లోస్ తో నలగని దుప్పటితో బెడ్ ఎప్పుడూ ఆహ్వానిస్తున్నట్లే ఉండాలి.
- డోర్స్ కి, కిటికీ లకు మ్యాచింగ్ కర్టెన్లు మనసుకి ఆహ్లాదం కలిగించే రీతిలో వ్రేలాడదీయాలి.
- కాళ్ళు తుడుచుకొనే పట్టా తప్పనిసరి ! గది శుభ్రం దానిపైనే ఆధారపడి ఉంటుంది.
- తెలుపు, లేత పసుపు, లేతపచ్చ, లేతనీలం, బేబీ పింక్ కలర్స్ వేస్తే బెడ్ రూమ్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
- బెడ్ లైట్ ఎరుపు కాకుండా ఏ రంగుదైనా ఉపయో గించవచ్చు.
-Advertisement-