beauty tips in telugu : సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం వల్ల చర్మంపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా చర్మ సమస్యల విషయానికి వస్తే, ఎక్కువగా వీటి భారిన పడేది ఎండలో ఎక్కువగా పనిచేయాల్సిన వారు లేదా ఎండలో తిరిగే పని ఉన్నవారు, వారికీ చర్మ సంరక్షణకు సమయం దొరకదు.
ఎందుకంటే వారు బయట పనితో పాటు ఇంటి పనులు కూడా చక్కబెట్టాల్సి ఉంటుంది. అందువల్ల, వారు తమను తాము చూసుకోవడానికి సమయం దొరకదు. కానీ ముఖాన్ని తాజాగా మరియు అందంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
అందుకే కనీసం పడుకునే ముందు అయినా చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి కొన్ని నిమిషాలు కేటాయించాల్సిన అవసరం ఉంది, అందుకోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి:
మీ కళ్ళకి విశ్రాంతినివ్వండి
పని కోసం మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు మరియు కంప్యూటర్‌లపై ఆధారపడటం వల్ల కళ్ళు అలసిపోతాయి అది కళ్ళ చుట్టూ నల్లటి వలయాలకు దారితీస్తుంది. అలా రాకుండా ఉండటానికి మరియు కళ్ళకు విశ్రాంతి కోసం, ఓ రెండు దోసకాయ ముక్కలతో కళ్లకు కాసేపు విరామం ఇవ్వచ్చు. అలా సుమారు 15 నిమిషాల పాటు కళ్లపై ఉంచిన తర్వాత, మాయిశ్చరైజర్‌ని ఉపయోగించి కళ్ల నుండి ముక్కు ఎముక వరకు సున్నితంగా మసాజ్ చేయాలి.
చర్మ కాంతిని పెంచుకోండి
శుభ్రమైన దుప్పట్లు, దిండ్లు మరియు తేలికపాటి కాటన్ పైజామాలను ఉపయోగించడం ద్వారా చర్మ సంరక్షణ చేయచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాలను నిద్రపోయే ముందు వాడకుండా పుస్తకం చదివి నిద్రపోవడం వలన నిద్ర బాగా పడుతుంది ఆ పై మంచి నిద్ర, మీ చర్మ కాంతిని పెంచుతుంది.
రోజంతా హైడ్రేటెడ్ గా ఉండండి
చర్మం తాజాగా ఉండటానికి , చేతులతో లేదా లైట్ ఫేస్ రోలర్‌తో ముఖాన్ని మసాజ్ చేయవచ్చు, ఇది అలసట నుండి బయటపడటానికి మరియు ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. రోజూ ఉదయం గోరువెచ్చని నీటిని తాగడం మంచిది, ఇది అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
వేడి నీటితో స్నానం
రోజంతా అలసిపోయిన శరీరానికి వేడి నీటితో స్నానం మసాజ్ లాగా పనిచేస్తుంది, దీనివలన శరీరానికి ఉత్సాహం, చర్మానికి ఆరోగ్యం వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
ఫేస్ ప్యాక్
సహజసిద్ధమైన ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించండి: చర్మానికి పోషణను అందించడానికి ఒక సాధారణ ఫేస్ ప్యాక్‌ను సిద్ధం చేసుకోవచ్చు. పెరుగుతో కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను కలిపి, ఆపై నేరుగా ముఖానికి రాసుకుని, 15 నిమిషాలు ఉంచిన తర్వాత కడగాలి. వెచ్చని నీటితో కడిగిన తర్వాత, మాయిశ్చరైజర్ ఉపయోగించవచ్చు.