beauty tips in telugu
- శీతాకాలంలో చర్మ సౌందర్యానికి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. మీది ఆయిల్ స్కిన్ అయితే సగం ఆపిక్కాయను ఉడికించి, చిదిమి పెట్టుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూను తేనె, ఒక టీ స్పూను ఓట్ మీల్ వేసి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఆరిన తర్వాత కడగాలి.
- చేమంతి పూల పరిమళాన్ని ఆస్వాదించి ఊపిరితిత్తులు సమస్యల నుంచి నివారణ పొందవచ్చు.
- ఒక స్పూను నిమ్మరసంలో రెండు స్పూన్ల వెనిగర్ కలిపి తలకు పట్టించి ఎగ్ షాంపూ తో తలను శుభ్రం చేస్తే చుండ్రు మటు మాయం!
- ఫంక్షన్లకు, పార్టీలకు వెళ్ళేటప్పుడు ఎక్కువ సమయం గడపాల్సి వస్తే ముందుగా ఐస్ క్యూబ్ ముఖాన్ని రుద్దిన తరువాత మేకప్ చేసుకుంటే మేకప్ తొందరగా చెరిగిపోదు.
- స్నానానికి రడీ చేసుకున్న నీటిలో ఒక పది చుక్కల నిమ్మరసం వేస్తే చర్మ సౌందర్యం మెరుగవుతుంది.
- క్యారెట్, బీట్రూట్లలో ఏదో ఒక జ్యూస్ రోజూ తాగితే శరీర కాంతి ఇనుమడిస్తుంది.
- పాలు, పెరుగు ఉంచిన పాత్రలకు మీగడ, జిడ్డు ఉంటే దానిని ముఖానికి, చేతులకు పట్టించుకొని తర్వాత స్నానం చేస్తే చర్మానికి నిగారింపు, మృదుత్వం కూడా!
- పుదీనా ఆకుల రసాన్ని ప్రతిరోజూ ఉదయం ముఖానికి పట్టించి అర గంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మానికి కాంతి వస్తుంది.
- పచ్చిపాలలో బార్లీ పిండి కలిపి, దీనికి కొంచెం నిమ్మకాయ రసం కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత వెచ్చని నీటిలో ముఖం కడిగేస్తే శుష్కించిన చర్మం కూడా మళ్ళీ వికసిస్తుంది.
- వేపాకు, పసుపు కలిపిన ముద్దను శరీరానికి మర్దన చేసి అరగంట తరువాత స్నానం చేస్తే ఎటువంటి చర్మ వ్యాధులైనా కొన్ని రోజులకు మాయమవుతాయి.
- మీది డ్రై స్కిన్ అయితే కంగారుపడకండి. శీతాకాలంలో కాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే చాలు. ఈ ప్యాక్ తయారు చేసి వేసుకోండి. ఒక టీ స్పూను ఆలివ్ ఆయిల్, ఒక కోడిగ్రుడ్డు (తెల్లసొన, పసుపు) ఒక టీస్పూను ఓట్మీల్, ఒక టీస్పూను తేనె తీసుకుని అన్నీ బాగా కలిసిపోయేట్లు కలుపుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి 15 నిముషాలు ఉంచి నీటిలో కడిగేసుకోవాలి.
- మీది జిడ్డుచర్మమా ! డీలాపడకండి! పైన చెప్పిన విధానాన్నే అనుసరిస్తూ గుడ్డులో తెల్లసొనను మాత్రమే వాడండి. మీ చర్మం మీకే చిత్రంగా అనిపిస్తుంది. ఒకవేళ పైన చెప్పినవి మీకు అందుబాటులో లేకుంటే కోడిగ్రుడ్డు, పాల మీగడలను కలిపి కూడా ఈ ప్యాక్ వేసుకోవచ్చు.
- మీరు నలభై అయిదు దాటుతున్నారా ? తెల్లవెంట్రుకలు వచ్చే వయసు అవి రాకుండా ఉండాలంటే రెండు వందల మిల్లీలీటర్ల కొబ్బరినూనెలో ఒక స్పూను కర్పూరం పొడిని కలిపి నిద్రపోవటానికి ముందు తలకు పట్టించి 5 ని॥లు మసాజ్ చేసుకోవాలి.
- స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో 5 చుక్కల జాస్మిన్ ఆయిల్ కలుపుకుంటే శరీరానికి, మనసుకు మంచి రిలీఫ్ ఉంటుంది.
- ఎండలో బయట తిరిగి వచ్చాక చల్లని మజ్జిగతో ముఖం కడిగి తర్వాత నీటితో కడిగేస్తే ముఖం ఎంతో ఫ్రెష్ గా కనబడుతుంది.
- మల్లెతీగ వేళ్ళను నిమ్మ రసంతో కలిపి గ్రైండ్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తరువాత కడిగేసెయ్యాలి. ఇలా చేస్తే తెల్లవెంట్రుకలు రావటాన్ని నివారించగలిగినట్లే !
- స్నానానికి ముందు గసగసాలను అరగంటసేపు పాలలో నానబెట్టి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి, మర్దన చేసి సున్నిపిండితో తోముకొని స్నానం చేయాలి. ఇలా నెలరోజులు చేస్తే చర్మానికి మంచిరంగు, నునుపు సంతరించుకుంటుంది.
- మీది జిడ్డు చర్మం అయితే ఏం భయపడక్కర్లేదు. తేనెలో ఉప్పు కలిపి ముఖంపై సుతారంగా రుద్దితే మృతకణాలు పోతాయి. జిడ్డు చర్మానికి ఇదే మంచి స్క్రబ్బర్. మీకు ఉప్పు తగిలితే ర్యాష్ వస్తుందా ? అయితే తేనెలో ఉప్పు బదులు పంచదార వాడండి !
also read :
beauty tips in telugu : సౌందర్య చిట్కాలు (18-07-2023)
beauty tips : రూపాయి ఖర్చు లేకుండా అందమైన ముఖం మీ సొంతం.. చిట్కాలివే..
-Advertisement-