Homebigg boss telugu season 6Bigg Boss 6: బిగ్ ట్విస్ట్‌.. బ్యూటీ క్వీన్‌ని ఎలిమినేట్ చేసేసారుగా..!

Bigg Boss 6: బిగ్ ట్విస్ట్‌.. బ్యూటీ క్వీన్‌ని ఎలిమినేట్ చేసేసారుగా..!

Telugu Flash News

Bigg Boss 6: బిగ్ బాస్ సీజ‌న్ 6లో కంటెస్టెంట్స్ ఎలిమినేష‌న్ చాలా ర‌సవ‌త్త‌రంగా సాగుతుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, వీరు టాప్ 5లో ప‌క్కా ఉంటారు అనుకున్న వాళ్లు అనూహ్య రీతిలో ఎలిమినేట్ అవుతున్నారు. శ‌నివారం బిగ్ బాస్ హౌస్ నుంచి బాలాదిత్యని బ‌య‌ట‌కు పంపారు. ఇక ఆదివారం మెరీనాతో పాటు వాసంతిల‌లో ఎవ‌రో ఒక‌రు వెళ‌తార‌నే టాక్ ముందు నుండి ఉంది. అయితే బ్యూటీ క్వీన్ వాసంతి ఈ వారం బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఇద్దరు మోస్ట్ బ్యూటీ కంటెస్టెంట్స్ లో శ్రీసత్య, వాసంతీలు ఉండగా, అందులో వాసంతి వెళ్లిపోవ‌డంతో కుర్రాళ్ల హృద‌యాలు కాస్త విల‌విల‌లాడిపోతున్నాయి.

ట‌ఫ్ కాంపిటీష‌న్..

ఇక వాసంతి ఎలిమినేష‌న్ త‌ర్వాత స్టేజ్ పైకి వ‌చ్చి తనకు ఇష్టమైన స్నేహితులు ఎవరూ అంటే రేవంత్, కీర్తి, మెరీనా లని చెప్పింది.. ఇక హౌస్ లో అందరూ ఇస్టమే అనిచెపుతూ.. వీరితోనే ఎక్కువ‌గా క‌నెక్ట్ అయ్యాన‌ని చెప్పింది. ఇక త‌న జర్నీ చూసి కూడా చాలా ఎమోష‌న‌ల్ అయింది వాసంతి. ఇక అంతకుమందు సరదా సరదా ఆటలతో వీకెండ్ ను ఎంజాయ్ చేశారు టీమ్ స‌భ్యులు. నాగార్జున కంటెస్టెంట్ తో రకరకాల జిమ్మిక్కులుచేయిస్తూ ఆట‌లాడిస్తూ డ్యాన్స్‌లు చేయించాడు. ఆదిరెడ్డి వేసిన డ్యాన్స్ ప్రేక్ష‌కుల‌కి ఫుల్ కిక్ అందించింది.

ఓ గేమ్ లో నాగార్జున సినిమా సెల‌బ్రిటీల‌తో పాటు హౌస్ మెట్స్ చిన్ననాటి ఫోటోస్ ను చూపిస్తూ.. గంట‌ నొక్కిన వారికి ఆన్సర్ చెప్పే అవకాశం ఇఛ్చారు. ఇక అందులో శ్రీహాన్ ఫోటోను ఎవరూగుర్తు పట్టలే. కీర్తీ పోటోను వాసంతి గుర్తు పట్టగా, హీరో రామ్ ఫోటోను శ్రీసత్య గెస్ చేసి పాయింట్స్ ద‌క్కించుకుంది.ఇలా గేమ్ అయితే చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి సగం మంది ఎలిమినేట్ అవ్వగా.. ఇంకా 10 మంది మాత్ర‌మే హౌస్ లో ఉన్నారు. ప‌ది మందిలో టాప్ 5లో ఉండేది ఎవ‌రు, విన్న‌ర్ ఎవ‌రు , రన్న‌ర్ ఎవ‌రు అనే దానిపై ఇప్పుడు అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.అయితే ఈ సారి బిగ్ బాస్ విన్నర్స్ ప్రైజ్ 50 ల‌క్ష‌లు అందుకోనున్నార‌ని నాగార్జున అనౌన్స్ చేశాడు. ఇప్పుడు దీనిపై అంద‌రు దృష్టి పెట్టారు.

also read news:

horoscope : 14-11-2022 సోమవారం ఈ రోజు రాశి ఫలాలు చూడండి

విచిత్రం.. చిన్నారి కంట్లో నుంచి రాళ్లు , బియ్యపు గింజలు !

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News