Telugu Flash News

BCCI: బీసీసీఐ మరీ అంత రిచ్ హా.. రెవిన్యూ ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డ‌తారు…!

BCCI: ప్ర‌పంచ క్రికెట్‌లో అతి సంప‌న్న‌మైన బోర్డ్‌గా బీసీసీఐని చెబుతుంటారు. ఐసీసీ.. బీసీసీఐ అడుగుజాడ‌ల‌లో న‌డుస్తుంద‌నే ప్ర‌చారం న‌డుస్తుంటుంది. టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా గెలిచిన స‌మ‌యంలో బీసీసీఐ అంపైర్లను కొనేశారంటూ పాక్ ఆటగాళ్లు విమర్శలు చేశారు. ఇలా ఆరోణలు రావడం ఇదేం కొత్తకాదు. టీమిండియాకు అనుకూలంగా ఏం జరిగినా దాన్ని డబ్బుతోనే ముడిపెట్టేస్తుంటారు దాయాదులు. మిగతా క్రికెట్ బోర్డులు, మాజీ క్రికెటర్లు కూడా బీసీసీఐకి వ్య‌తిరేఖంగా మాట్లాడేందుకు చాలా ఆలోచిస్తుంటారు.

అయితే ప్రంచ క్రికెట్‌లో అతి సంపన్న బోర్డు అయిన బీసీసీఐ రెవెన్యూ ? ఏడాదికి రూ.3730 కోట్లు అని తెలుస్తుంది. మిగతా బోర్డులు రెవెన్యూ పరంగా బీసీసీఐకి ఆమడ దూరంలోనే ఉన్నాయ‌ని టాక్. ఐపీఎల్ విజయవంతం కావడంతో బీసీసీఐ ఖజానా భారీగా నిండుతూనే ఉంది. బీసీసీఐ తర్వాత సంపన్న క్రికెటో బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా కాగా, దీని రెవెన్యూ రూ.2,843 కోట్లు. అంటే ఈ రెండింటి మధ్య సుమారు దాదాపు వెయ్యి కోట్ల తేడా ఉందన్నమాట. ఆస్ట్రేలియా త‌ర్వాత మరుసటి స్థానంలో రూ.2135 కోట్లతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిలిచింది.

అనంతరం కేవలం రూ.811 కోట్లతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నాలుగో ర్యాంకులో నిలిచింది. సుమారు రూ.802 కోట్లతో బంగ్లాదేశ్ జట్టు మరుసటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా క్రికెట్ సౌతాఫ్రికా (రూ.425 కోట్లు), న్యూజిల్యాండ్ (రూ.210 కోట్లు), వెస్టిండీస్ (రూ.116 కోట్లు), జింబాబ్వే (రూ.113 కోట్లు), శ్రీలంక (రూ.100 కోట్లు) ఉన్నాయి. అయితే ఐపీఎల్ వ‌ల‌న బీసీసీఐ భారీగానే ఆర్జిస్తుంది. తొలి టీ20 ప్రపంచకప్ జరిగిన మరుసటి ఏడాదిలోనే ఐపీఎల్ మొదలు కాగా, ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడాలని కలలు కంటారు. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బ్యాష్ లీగ్, ఇంగ్లండ్ నిర్వహించే ‘ది హండ్రెడ్’ తదితర లీగులను ఐపీఎల్ సులభంగా దాటేసి అత్యంత బలమైన లీగ్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

Exit mobile version