HomesportsBCCI: బీసీసీఐపై కొన‌సాగుతున్న విమ‌ర్శ‌ల వ‌ర్షం.. ఆ మాత్రం క్లారిటీ లేక‌పోతే ఎలా అని తిట్టిపోస్తున్న ఫ్యాన్స్

BCCI: బీసీసీఐపై కొన‌సాగుతున్న విమ‌ర్శ‌ల వ‌ర్షం.. ఆ మాత్రం క్లారిటీ లేక‌పోతే ఎలా అని తిట్టిపోస్తున్న ఫ్యాన్స్

Telugu Flash News

BCCI: రాను రాను బీసీసీఐ తీరు అభిమానులకి విసుగు తెప్పిస్తుంది.త‌ప్పుడు నిర్ణ‌యాలు, అన‌వ‌స‌ర స్టేట్‌మెంట్స్ వ‌ల‌న బీసీసీఐపై క్రికెట్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్ని విమర్శలు వస్తున్నా బీసీసీఐ తీరు మారడం లేదు. 10 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ గెలవకపోయినా టాప్ టీమ్స్‌లో ఒకటిగా నెట్టుకొస్తున్న టీమిండియా…గత ఏడాది న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో వన్డే సిరీస్‌లు ఓడిపోయిన విష‌యం తెలిసిందే.. ఈ ఏడాది బీసీసీఐ తీసుకున్న నిర్ణయాలపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది… డిసెంబర్ 27న శ్రీలంకతో సిరీస్‌కి బీసీసీఐ జ‌ట్టుని ప్ర‌క‌టించ‌గా, గాయం నుంచి పూర్తిగా కోలుకోని జస్ప్రిత్ బుమ్రాకి ఈ సిరీస్‌లో చోటు దక్కలేదు. అయితే వారం రోజులకు బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని, అతన్ని వన్డే సిరీస్‌ జట్టులో చోటు కల్పిస్తున్నట్టు ప్రకటించింది…

సరిగ్గా వన్డే సిరీస్ ఆరంభానికి ఒక్క రోజు ముందు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది…జస్ప్రిత్ బుమ్రా గాయం నుంచి కోలుకున్నా అతనికి కాస్త సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో వన్డే సిరీస్ నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించింది బీసీసీఐ. డిసెంబర్ 27 నుంచి జనవరి 9 మధ్య 13 రోజుల గ్యాప్‌లో మూడు సార్లు నిర్ణయాన్ని మార్చుకుంది బీసీసీఐ. బీసీసీఐకి ఆటగాళ్ల విషయంలో ఎంత అస్పష్టత ఉందో ఈ సంఘటన ద్వారా అర్థం అవుతోంది… బుమ్రా ఫిట్‌నెస్ సాధించిన వెంటనే వన్డే సిరీస్‌లో ఆడించాలని అనుకోవడం, ఆ తర్వాత నాలుగు రోజులకు మళ్లీ ఏదో గుర్తుకు వచ్చినట్టు అతన్ని తప్పించడం చూస్తుంటే టీమిండియాలో క్లారిటీ మిస్ అయినట్టు అర్ధ‌మ‌వుతుంది.

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ విషయంలోనూ ఇదే ధోరణి కనిపించింది. చేతన్ శర్మ పనితీరు బాగోలేదని, బంగ్లా టూర్‌ నడుస్తున్న సమయంలో సెలక్షన్ కమిటీపై వేటు వేసింది బీసీసీఐ. మళ్లీ ఏమైందో ఏమో కానీ చేతన్ శర్మనే బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేసింది. అసలు వేటు వేయడానికి, మళ్లీ నియమించడానికి మధ్య ఏం జరిగింది? క్రికెట్ ఫ్యాన్స్‌కి అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. ఈ ర‌కంగా చూస్తుంటే ఇటీవ‌ల కాలంలో బీసీసీఐ నిర్ణ‌యాలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News