HomesportsBCCI:టీమిండియా జ‌ట్టులో జడేజాకి ఛాన్స్ లేన‌ట్టేనా... బీసీసీకి పెద్ద త‌ల‌నొప్పులు...!

BCCI:టీమిండియా జ‌ట్టులో జడేజాకి ఛాన్స్ లేన‌ట్టేనా… బీసీసీకి పెద్ద త‌ల‌నొప్పులు…!

Telugu Flash News

BCCI:ఈ ఏడాది చివ‌రిలో టీమిండియా వేదిక‌గా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ సారి సొంత గ‌డ్డ‌పై మ్యాచ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మంచి జ‌ట్టుని ఎంపిక చేసే ప‌నిలో పడింది బీసీసీఐ. అయితే ప్ర‌స్తుతం అంద‌రు ఆట‌గాళ్లు ఫామ్‌లో ఉండ‌గా, ఫైన‌ల్ టీంలో ఎవ‌రిని ఆడించాల‌నే త‌ల‌నొప్పి బీసీసీకి మారింది. ఇక ఆసియా కప్ సమయంలో మోకాలి గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా రీఎంట్రీ చేయడం కష్టంగా కనపడుతోంది. అతని గైర్హాజరీలో జట్టులో వరుసగ అవకాశాలు పొందుతున్న అక్షర్ పటేల్ ప్రతిసారీ తన సత్తా నిరూపించుకుంటూ వ‌స్తున్నాడు.

ఇటీవలి కాలంలో రవీంద్ర జడేజా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. చివరగా 2018లో కేవలం 8 మ్యాచుల్లోనే 14 వికెట్లు తన ఖాతాలో వేసుకున్న అతను.. ఆ తర్వా ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన ఏ మాత్రం చేయలేదు. ఆ ఏడాదిలో జడ్డూ యావరేజ్ 24.57గా ఉంది. అయితే ఆ తర్వాత వరుసగా మూడేళ్లలో అతని యావరేజిలు 38, 64.23, 53.92గా నమోదైంది. ప్ర‌స్తుతం అక్షర్, వాషింగ్టర్ సుందర్ ఈ విషయంలో మందంజలో ఉండ‌గా, ఆయ‌న స్థానాన్ని వీరు భ‌ర్తీ చేస్తార‌ని తెలుస్తుంది. ఇక
2020లో భారత జట్టు మొత్తం 9 వన్డేలు ఆడింది. వీటన్నింటిలోనూ జడేజా కూడా ఆడాడు.

భారత జట్టు ఆడిన అన్ని మ్యాచుల్లో జడ్డూ పాల్గొనలేదు. 2022లో భారత్ మొత్తం 6 వన్డేలు మాత్రమే ఆడింది. ఆ తర్వాత ఆడిన టీ20 వరల్డ్ కప్‌లో కూడా జడ్డూ ఆడలేదు. ఇక 2022 లెక్కలు తీసుకుంటే భారత జట్టు 24 వన్డేలు ఆడగా.. జడ్డూ కేవలం 8 మ్యాచుల్లోనే కనిపించాడు. ఇక ఇప్పుడు మోకాలి గాయం నుంచి కోలుకొని నేరుగా టీమిండియా పునరాగమనం వద్ద ఒక ఉపద్రవం ఎదురవడం అవనడం గ్యారంటీగా కనిపిస్తోంది. 2022లోనే అక్షర్ పటేల్ 8 మ్యాచులోనూ రాణించాడు. ఈ మ్యాచుల్లో 33 సగటుతో 198 పరుగులు చేశాడు. అలాగే 11 వికెట్లు తీసుకొని, ఐదు మ్యాచుల్లో అక్షర్ అద్భుతంగా రాణించాడు. ఇలా రోజులు గడిచేకొద్దీ అక్షర్ తనకు దక్కిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకొని జట్టులో స్థానం పదిలం చేసుకుంటున్నాడు. మిగ‌తా ఆట‌గాళ్లు కూడా ఇప్పుడు త‌మ టాలెంట్ నిరూపించుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలోనే బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీకీ చిక్కులు వ‌చ్చిప‌డ్డాయి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News