Telugu Flash News

BBC Documentary : మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ రగడ.. కేరళలో ప్రదర్శనపై పెను దుమారం!

ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) పై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై (BBC Documentary) వివాదం చెలరేగుతోంది. ప్రధాని మోదీ జీవితంపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ భారతదేశం మినహా అనేక ప్రాంతాల్లో ప్రసారమైంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. యూట్యూబ్‌కు, ట్విట్టర్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. అభ్యంతరకరంగా ఉన్న ఈ వీడియోల లింకులను తొలగించాలని సూచించింది.

BBC Documentary on narendra modi

తాజాగా ఈ వివాదం మరింత ముదురుతోంది. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా మోదీ బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామంటూ అక్కడి వివిధ రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు పేర్కొనడంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించి తక్షణమే డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సీపీఎం పార్టీకి అనుబంధంగా ఉన్న యువజన విభాగం డీవైఎఫ్‌ఐ మంగళవారం ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటన ఇచ్చింది. బీబీసీ మోదీ డాక్యుమెంటరీని రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రదర్శిస్తామని చెప్పింది. తర్వాత సీపీఎం విద్యార్థి వింగ్‌ ఎస్‌ఎఫ్‌ఐ, కేరళ కాంగ్రెస్‌ కమిటీ అనుబంధ విభాగాలు కూడా ఇదే ప్రకటన చేయడంతో మరింత రాజకీయ దుమారం రేగింది. రాష్ట్రంలో ఎక్కడా ఈ డాక్యుమెంటరీ ప్రదర్శించడానికి వీల్లేదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ కోరారు. మతకలహాలు సృష్టించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

అంతర్జాతీయంగా దుమారం..

మంగళవారం కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. దీనిపై బీజేపీ యువ మోర్చా నేతలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పాలక్కడ్‌, ఎర్నాకుళం ఏరియాల్లో పలువురు కార్యకర్తలు నిరసన తెలిపారు. వీరిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కాగా, దీనిపై అంతర్జాతీయంగానూ దుమారం రేగుతోంది. మోదీపై బీబీసీ డాక్యుమెంటరీపై తమకేమీ తెలియదని అమెరికా స్టేట్‌ విభాగం స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య బలమైన బంధాన్ని తాము కోరుకుంటున్నట్లు తెలిపింది.

also read news: 

viral video today : కుమార్తె సర్‌ప్రైజ్‌తో ఫ్యామిలీ ఫంక్షన్‌లో ట్విస్ట్‌!

nara lokesh padayatra : లోకేష్ పాదయాత్రకు అనుమతి.. పోలీసుల కండీషన్లు ఇవే..!

Hyderabad : హైదరాబాద్‌ నగరాన్ని వణికిస్తున్న చలి.. ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన అధికారులు.. బీ కేర్‌ఫుల్‌!

Sharwanand : శ‌ర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ తెలుసా ?

Uttar Pradesh : యూపీలో ఇద్దరు యువతుల ప్రేమ కథ.. ట్విస్టులు మామూలుగా లేవు !

 

 

Exit mobile version