Barry McCarthy: ప్రస్తుతం టీ 20 ప్రపంచ కప్ టోర్నీ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. చిన్న టీంలు కూడా మంచి ప్రతిభ చూపిస్తుండడంతో బిగ్ ఫైట్ నెలకొంటుంది.
బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్ మధ్య జరిగిన సూపర్-12 మ్యాచ్ లో ఐర్లాండ్ పై ఆస్ట్రేలియా 42 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కంగారులు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేశారు.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ ఆదిలోనే డెవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయింది. మెక్‌కార్తీ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్, కెప్టెన్ ఫించ్ తో కలిసి మ్యాచ్ ను ముందుకు తీసుకెళ్లారు.
వాటే ఫీల్డింగ్..
22 బంతుల్లో 2 సిక్స్ లు, 2 ఫోర్లతో 28 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ మెక్‌కార్తీ బౌలింగ్ పెవిలియన్ చేరగా, అనంతరం వచ్చిన మ్యాక్స్ వెల్ 13 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్టోయినిస్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
తర్వాత స్టోయినిస్ తప్ప మిగతా ఎవరు కూడా పెద్దగా రాణించలేదు. అయితే 180 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది.
ఐర్లాండ్ వికెట్ కీపర్ లోర్కాన్ టక్కర్ హాఫ్ సెంచరీతో రాణించి ఆస్ట్రేలియా గుండెల్లో భయం పుట్టించాడు. అతను 48 బంతుల్లో ఒక సిక్స్, 9 ఫోర్లతో 71 పరుగులు చేశాడు. అతనికి మరో బ్యాట్స్‌మెన్ అండగా ఉండి ఉంటే మంచి విజయం సాధించేవాళ్లు.
ఇక ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ ఫీల్డర్ మెక్‌కార్తీ అద్భత ఫీల్డింగ్ చేశాడు. 14 ఓవర్ రెండో బంతిని అదిర్ వేయగా.. స్టోయినిస్ దాన్ని సిక్స్ కొట్టాలని ట్రై చేశాడు. బంతి గాల్లో లేచింది. పరుగెత్తుకుంటూ వచ్చిన మెక్‌కార్తీ క్యాచ్ పట్టుకున్నాడు.
View this post on Instagram
కానీ బౌండరీలో పడిపోతుందని తెలిసి బంతిని బయటకు విసిరి వేశాడు. దీంతో ఆస్ట్రేలియాకు ఆరు పరుగుల దగ్గర రెండు పరుగులే వచ్చాయి. అయితే ఐర్లాండ్ ఫీల్డర్ స్టన్నింగ్ క్యాచ్ చూసి అందరు అవాక్కయ్యారు. కాగా, గ్రూప్ 1లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియాను ఐదు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
read more news :
Happy Birthday Aishwarya Rai : ఈ ప్రపంచ సుందరి గురించి తెలుసుకోవాల్సిన 40 వాస్తవాలు