Telugu Flash News

barley water benefits : బార్లీ నీరు తాగితే బోలెడు లాభాలు..

Barley Water

barley water benefits : బార్లీ తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక బార్లీ కలిపిన నీరు తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. బాడీకి మేలు చేస్తుంది.

1. మన శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలు క్లీన్‌ చేసేందుకు బార్లీ నీరు ఉపయోగపడుతుంది.

2. బార్లీ నీటిని తయారు చేసుకోవడం వల్ల అనేక విధాలుగా లబ్ధి కలుగుతుంది.

3. రెండున్నర లీటర్ల నీటిలో ఓ కప్పు బార్లీ గింజలు వేసి ఉండికించుకోవాలి.

4. అనంతరం ఆ గింజలను తీసేసి నీటిని తరచూ తాగుతుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. నానబెట్టిన గింజల్ని కూడా తినొచ్చు.

5. మలబద్ధకంతో బాధపడుతున్న వారు బార్లీ నీరు తాగితే జీర్ణ వ్యవస్థ బాగా పని చేస్తుంది.

6. చిన్న పిల్లలకు జ్వరం వచ్చిన సందర్భాల్లో బార్లీ నీరు మంచి ఔషధంగా పని చేస్తుంది.

7. బార్లీ నీటితో పాటు మజ్జిగ, నిమ్మరసం కలిపి తీసుకుంటే మూత్ర సంబంధ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

8. బాలింతలకు పాలు పడటంలో సమస్యలుంటే పాలతో కలిపిన బార్లీ నీరు తీసుకోవాలి. బార్లీ గింజలను పిండిలా చేసి వంటకాలు కూడా చేసుకోవచ్చు.

also read :

సమీరా రెడ్డి తొలి ఆడిష‌న్ మహేష్ బాబు చిత్రానికే.. ఏమైందంటే?

Bhanu Priya: నటి భానుప్రియ సంచ‌ల‌న కామెంట్స్..

Exit mobile version