HomecinemaDevara : దేవ‌ర టైటిల్ నాది... కొట్టేశారు అంటూ బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న ట్వీట్

Devara : దేవ‌ర టైటిల్ నాది… కొట్టేశారు అంటూ బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న ట్వీట్

Telugu Flash News

Devara: ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఆచార్య‌తో తొలి ఫ్లాప్ చ‌వి చూసిన కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ చేస్తున్నాడు. గ‌త కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. మూవీకి ఎలాంటి టైటిట్ ఫిక్స్ చేస్తారా, ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుంద‌ని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆశ‌గా ఎదురు చూశారు. ఈ క్ర‌మంలోనే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి చిత్ర బృందం అదిరిపోయే ట్రీట్‌ వచ్చింది.

మే 20న‌ ఎన్టీఆర్‌ బర్త్ డే కావ‌డంతో సందర్భాన్ని పురస్కరించుకుని ఒక రోజు ముందే చిత్ర టైటిల్‌తోపాటు ఎన్టీఆర్‌ ఫస్ట్ లుక్‌ని కూడా విడుద‌ల చేశారు. ఫ‌స్ట్ లుక్‌లో ఎన్టీఆర్ నల్లని దుస్తులు ధరించి చేతిలో ఆయుధం పట్టుకుని సముద్రంలో రాళ్లపై నిల్చొని చాలా కోపంగా చూస్తున్నట్టుగా ఉంది. ఈ పిక్ అభిమానుల‌కి గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంది. చూస్తుంటే ఈ సినిమా మాస్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కుతుందని అభిమానులు భావిస్తున్నారు.

బండ్ల గణేష్ ట్వీట్ వైరల్

అయితే ఒక‌వైపు మూవీ ఫ‌స్ట్ లుక్ గురించి హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తున్న నేప‌థ్యంలో నిర్మాత బండ్ల గణేష్ తెరపైకి వచ్చాడు. దేవరా టైటిల్ ని నేనే రిజిస్టర్ చేయించుకున్నా… నేను మరిచిపోవడంతో ఇప్పుడు ఆ టైటిల్ ని కొట్టేసారు అంటూ సంచ‌ల‌న‌ ట్వీట్ చేసి వార్త‌లలోకి ఎక్కాడు.

ఈ ట్వీట్ కాస్తా వైరల్ అవ్వడంతో మ‌ళ్లీ స్పందిస్తూ.. దేవరా టైటిల్ తీసుకున్న నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే తారక్ కూడా నా దేవర కాబట్టి అంటూ క్లారిటీ ఇవ్వ‌డంతో ఎలాంటి వివాదాలు జ‌ర‌గ‌వు అంటూ అభిమానులు డిసైడ్ అయ్యారు. ఈ టైటిల్ పై ఇంకా ఎలాంటి వివాదం కొనసాగించే ఉద్దేశ్యం లేని బండ్ల గణేష్ ఇలా సింపుల్‌గా దీనికి పులిస్టాప్ పెట్టిన‌ట్టు తెలుస్తుంది.

-Advertisement-

అస‌లు ఈ టైటిల్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించిన‌ట్టు స‌మాచారం..ఇటీవ‌ల వ‌చ్చిన భీమ్లా నాయక్ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఒక లో దేవరా అనే పదాన్ని త్రివిక్రమ్ వాడాడు. ఇప్పుడు దానినే ఎన్టీఆర్ 30వ సినిమాకి పెట్టడం విశేషంగా మారింది.

ఇక ఈ టైటిల్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సంప్రదించిన తర్వాత జూనియ‌ర్ మూవీకి కన్ఫర్మ్ చేసిన‌ట్టు టాక్ న‌డుస్తుంది. బండ్ల గణేష్‌.. కొన్నాళ్లుగా పవన్‌ కళ్యాణ్‌ని దేవర అంటూ పిలుస్తూ వ‌చ్చేవారు. మార్నింగ్‌ లేవడంతోనేఆయ‌న `దేవర` అంటూ ట్వీట్లు పెట్టేవారు. ఆ టైటిల్‌తోనే పవన్‌తో సినిమా చేసేందుకు ఆయన చాలా కాలంగా వెయిట్ చేసారు. కాని అది కుదర‌న‌ట్టు క‌నిపించింది.ఇక దేవ‌ర చిత్రం విష‌యానికి వ‌స్తే.. ఇందులో జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తుంది.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News