Taraka ratna: నందమూరి తారకరత్న అకాల మరణం.. అటు నందమూరి కుటుంబాన్ని, ఇటు నందమూరి అభిమానులను ఎంతో బాధిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తారకరత్న మరణించినప్పటి నుండి ఆయన కుటుంబం చాలా తీవ్రమైన బాధలని ఎదుర్కొంటుంది. బాలయ్య కూడా తారకరత్న మరణ వార్తని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తాజాగా తారకరత్నపై తనకు ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు బాలయ్య.
తన కుటుంబంలో వచ్చిన కష్టం మరే ఇతర కుటుంబాల్లో రాకూడదు అని గొప్ప మనసుతో బాలయ్య మంచి నిర్ణయం తీసుకున్నారు బాలయ్య. తారకరత్న పేరు మీద గుండె జబ్బులు ఉన్న పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు బాలయ్య .
హిందూపురంలో తాను నిర్మించిన హాస్పిటల్ లో హెచ్ బ్లాక్ కు తారకరత్న పేరు పెట్టిన ఆయన నిరుపేదల వైద్యం కోసం రూ. కోటీ 30 లక్షల రూపాయలు పెట్టి ఆపరేషన్ పరికరాలను ఆ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.
ఇక ఈ హాస్పిటల్ లో చిన్నపిల్లలకు ఉచితంగా భోజనంతో పాటుగా వారికి కావాల్సిన మందులు కూడా మూడు నెలల పాటు ఉచితంగా ఇవ్వనున్నారు. మొత్తానికి తారకరత్న పేరు చరిత్రలో నిలిచిపోయే విధంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు బాలయ్య.
also read :
Viral Video : ఎన్‌కౌంటర్ చేయబోమని రాసివ్వాలి.. అప్పుడే ఆస్పత్రికి వస్తానంటూ ఖైదీ హల్ చల్!