HomecinemaBala Krishna: మ‌రోసారి పాట పాడిన బాల‌య్య‌.. అంద‌రు స్టాండింగ్‌ ఒవేషన్‌

Bala Krishna: మ‌రోసారి పాట పాడిన బాల‌య్య‌.. అంద‌రు స్టాండింగ్‌ ఒవేషన్‌

Telugu Flash News

Bala Krishna: నంద‌మూరి బాల‌కృష్ణ టాలెంట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న న‌టుడిగానే కాకుండా హోస్ట్‌గాను తానేంటో నిరూపించుకున్నాడు. ఇక రాజ‌కీయ నాయ‌కుడిగా కూడా స‌త్తా చాటుతున్నాడు. అప్పుడ‌ప్పుడు సింగ‌ర్‌గాను అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాడు. గ‌తంలో చాలా సార్లు త‌న గొంతు స‌వ‌రించుకున్న బాల‌య్య అద‌ర‌హా అనిపించాడు. ఇక తాజాగా తాజాగా లైవ్‌లో పాట పాడి ఆడియెన్స్ చేత స్టాండింగ్‌ ఒవేషన్ అందుకున్నాడు.

సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖతార్‌లోని దోహాలో ఓ ఈవెంట్‌కి గెస్ట్‌గా వెళ్లారు బాలయ్య. అక్క‌డ‌ అభిమానుల కోరిక మేరకు ఎన్టీఆర్‌ నటించిన `జగదేకవీరుడుని` చిత్రంలోని శివశంకరీ పాటని ప్రొఫేషనల్‌ సింగర్‌ తరహాలో అద్భుతంగా ఆలపించారు. బాలయ్య పాటకి అభిమానులు ఫిదా కావ‌డంతో ఆడియ‌టోరియం చప్పట్లతో మారు మోగింది. అంతేకాదు, అంద‌రు స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతుంది. గతంలోనూ ఒక స్టేజ్‌పై ఇదే శివశంకరీ పాటను ఆల‌పించిన అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నారు బాల‌య్య‌.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News