Telugu Flash News

Bala Krishna: రెండో ఫ్యామిలీ మ్యాట‌ర్ లీక్ చేసిన బాల‌కృష్ణ‌.. చంద్ర‌బాబుతో ర‌చ్చ మాములుగా లేదుగా.!

balakrishna unstoppable 2 first episode with chandrababu naidu

balakrishna unstoppable 2 first episode with chandrababu naidu

Bala Krishna: నంద‌మూరి బాల‌కృష్ణ‌లో స‌రికొత్త యాంగిల్ చూపించిన షో అన్‌స్టాప‌బుల్. తొలి సీజ‌న్ స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి కావ‌డంతో రెండో సీజ‌న్‌కి టైం ఫిక్స్ చేశారు. `అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే 2` షో ఈ నెల 14(శుక్రవారం) నుంచి ప్రసారం కానుంది. అందులో భాగంగా షోకి సంబంధించి తొలి ఎపిసోడ్‌ ప్రోమోని విడుదల చేశారు.

తొలి ఎపిసోడ్‌కి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెస్ట్ గా రాగా, బావబావమరుదుల మధ్య సంభాషణల ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. ఇందులో బాల‌కృష్ణ‌.. తన ఫ్యామిలీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర విషయాలు బయటపెట్టారు. తనకిప్పుడు రెండు ఫ్యామిలీలున్నాయన్నారు.

జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్‌ 45లో వసుందర, పిల్లలున్నారని చెప్పారు. గతేడాది నుంచి మరో ఫ్యామిలీని మెయింటేన్‌ చేస్తున్నానని షాకిచ్చాడు.

ఇంట్రెస్టింగ్ ప్రోమో..

`మీ లైఫ్‌లో మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్‌ పనేంటి?` అని చంద్రబాబుని బాలయ్య ప్రశ్నించగా, మీకంటే ఎక్కువే చేశానని చెప్పాడు చంద్రబాబు నాయుడు. మీరు సినిమాల్లో చేశారు. నేను స్టూడెంట్‌గా చేశానని తెలిపారు. అమ్మాయిలు కనిపిస్తే సైలెన్సర్‌ తీసేసి, కీక్‌ కీక్‌ అంటూ హార్న్ చేసేవాళ్లమంటూ ఆయ‌న చేసిన చిలిపి పనుల గురించి వివ‌రించాడు.

ఇక మా చెల్లిని ఏమని పిలుస్తారు బావ అని అడగ్గా, `భూ.. `అని పిలుస్తా అని చెప్పడంతో హౌజ్‌లో తెల అరిచేశారు. మా అందరి సాక్షిగా మా చెల్లికి ఐ లవ్ యూ చెప్పాలని బాల‌య్య అన‌డంతో వెంటనే భువనేశ్వరికి ఫోన్‌ చేసిన చంద్రబాబు.. మీ బాలకృష్ణగారి చేతిలో ఇరుక్కుపోయా నేను అంటూ మాట్లాడటం తెగ ఆస‌క్తిగా అనిపించింది.

లైఫ్‌లో అతి పెద్ద నిర్ణయం ఏంటనేది బాలయ్య ప్రశ్నించగా `1995 నిర్ణయం` అని చంద్రబాబు తెలిపారు. ఒక వ్యక్తిగా మిమ్మల్ని నేను అడుగుతున్నా. ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా?.. అని చంద్రబాబు ప్రశ్నించగా, ఆ రోజు నాకు బాగా గుర్తుంది అని బాలయ్య చెప్పారు.

ఆయన్ని కాళ్లు పట్టకుని అడుకున్నా నా మాట వినండి అని, కానీ వినలేదని, ఇక వేస్ట్.. ` అని తాను ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విష‌యంపై కొంత స‌స్పెన్స్ క్రియేట్ చేశారు. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వ‌ర‌కు ఆగాల్సిందే..

Exit mobile version