Telugu Flash News

Balagam: తెలంగాణ కానిస్టేబుల్ ప‌రీక్ష‌లో బ‌ల‌గం సినిమాపై ప్ర‌శ్న‌.. ఏం అడిగారంటే..!

Balagam: ఇటీవ‌లి కాలంలో చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద విజ‌యం సాధించిన చిత్రం బ‌ల‌గం. జబర్దస్త్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి మొదటి సారి మెగాఫోన్‌ పట్టి ఈ సినిమాను తెర‌కెక్కించ‌గా, ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌ రామ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

థియేట‌ర్‌లో దుమ్మురేపిన ఈ సినిమా ఓటీటీలో కూడా అద‌ర‌గొడుతుంది. సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రు కూడా మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. తెలంగాణలోని చాలా పల్లెల్లో పెద్ద పెద్ద ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటుచేసుకుని మరీ బ‌ల‌గం సినిమాని వీక్షించారు.

బ‌ల‌గం సినిమాకి ఎన్నో అంత‌ర్జాతీయ అవార్డులు కూడా వ‌రించాయి. అయితే తాజాగాబలగం సినిమాపై తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ రాతపరీక్షలో ప్ర‌శ్న అడిగారు.

మార్చి 2023లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో బలగం సినిమాకు ఏ విభాగంలో పురస్కారం లభించింది అనే అబ్జెక్టివ్‌ టైప్ ప్రశ్నకు ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ నాటకం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంభాషణ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు.

మ‌రి దీనికి స‌మాధానం ఏంటంటే ఉత్తమ నాటకం. సినీ ప్రియులు ప్ర‌తి ఒక్కరు ఈ స‌మాధానం ఇచ్చి ఉంటారు. కాగా, బ‌లగం సినిమాకు అంతర్జాతీయంగా మొత్తం 40 పురస్కారాలు వ‌రించాయి.

also read :

Chaitanya: కొరియోగ్రాఫ‌ర్ చైత‌న్య మృతితో ఎమోష‌న‌ల్ అయిన శ్ర‌ద్ధా, ర‌ష్మీ గౌతమ్

Agent : వింత వాద‌న‌.. లైగ‌ర్, ఏజెంట్ చిత్రాలు ఫ్లాప్ కావ‌డానికి కార‌ణాలు ఇవేన‌ట‌…!

Exit mobile version