Homebigg boss telugu season 6Bigg Boss 6: చీ.. ఇంత దిగ‌జారిపోయావా అంటూ గీతూపై ఫుల్ ఫైర్ అయిన బాలాదిత్య‌

Bigg Boss 6: చీ.. ఇంత దిగ‌జారిపోయావా అంటూ గీతూపై ఫుల్ ఫైర్ అయిన బాలాదిత్య‌

Telugu Flash News

Bigg Boss 6 : బాబోయ్.. బిగ్ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్స్ క్రాక‌ర్స్ లా పేలుతున్నారు. ఛాన్స్ రావాలే కాని ఫుల్ ఫైర్ అవుతున్నారు. తాజా ఎపిసోడ్‌లో బాలాదిత్య .. గీతూపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. ఎప్పుడు మంచోడు మంచోడు అని పిలుపించుకునే బాలాదిత్య ఈ రేంజ్‌లో ఫైర్ అవ‌డాన్ని చూసి అంద‌రు షాక్ అయ్యారు. మొత్తానికి రీసెంట్ ఎపిసోడ్ అరుపులు.. కేకలు కన్నీళ్ళతో దద్దరిల్లిపోయింది. ఇక ఇనయా అందరికి షాక్ ఇస్తూ.. వాష్ రూమ్ లోకి వెళ్శి బయటకు రాను అంటూ ఏడుస్తూ చెప్పింది. బిగ్ బాస్ పిలిస్తేనే వస్తాను అంటూ అలా కూర్చుంది. ఒకానొక సంద‌ర్భంలో రేవంత్ తలుపు పగలగొట్టడానికి చూడగా.. బిగ్ బాస్ స్పందించి ఇనయాను లోపలికి పిలిచి ఆమెకు ధైర్యం అందించాడు.

ఫుల్ ట‌ఫ్‌..

ఇక కెప్టెన్సి కోసం ఓ టాక్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో రెండు టీమ్ లను తయారు చేయగా.. గీతు లీడర్ గా ఒక టీమ్. ఆదిరెడ్డి లీడర్ గా ఒక టీమ్ గా మారారు. ఈ టాస్క్‌లో కూడా ఓ రేంజ్‌లో పోటీ న‌డిచింది. రాజ్ కోసం రెండు టీమ్ లు పోటీ ప‌డ‌గా, చివరికి బ్లూ టీమ్ కు రాజ్ వెళ్లిపోయాడు. ఇక గేమ్ స్టార్ట్ కాగా, . హోరా హోరీ పోరులో రెడ్ టీమ్ లో ఉన్న ఫైమా బ్లూటీమ్ కు చిక్క‌డంతో ఆమె బాడ్జ్ లు లాక్కోని చంపేశారు బ్లూ టీమ్ మెంబర్స్. అప్పుడు గీతు.. బాలాదిత్య సిగరెట్లను దాచేసింది. బాడ్జ్ లు రెండు ఇస్తే నేను రెండు సిగరేట్లు ఇస్తానంటూ.. గీతూ పట్టుపట్టుకుని కూర్చుంది.

geetu in bigg boss 6అటు రేవంత్ పై మార్యాదగా మాట్లాడు రేవంత్ అంటూ వార్నింగ్ ఇచ్చిన బాలాదిత్య.. గీతూను కూడా ఆవేశంలో నోటికి వచ్చినట్టు తిట్టాడు. సిగరెట్లు దాచి.. ఇంత దిగజారిపోతావ్ అనుకోలేదు అంటూ ఫైర్ అయ్యాడు బాలాదిత్య. అంతే కాదు ఎమోషనల్ అయ్యి ఏడ్చేశాడు కూడా . అటు గీతూ కూడా బాలాదిత్య అన్న మాటలకు బాధపడుతూ..ఆదిరెడ్డికి చెప్పుకుని బాధ‌ప‌డింది. ఇక శ్రీహాన్ బాడ్జ్ లు బాలాదిత్య తీసుకోగా.. అది చెల్లదని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. మరో వైపు బ్లూ టీమ్ నుంచి బాలాదిత్య కూడా చనిపోయినట్టు ప్రకటించేశారు. ఇక కీర్తికి దెబ్బ తగలడంతో .. ఆమె బదులుగా గేమ్ ఆడే ఛాన్స్ ను బిగ్ బాస్ ఫైమాకు ఇచ్చాడు. దాంతో రెడ్ టీమ్ ఫుల్ ఖుషి అయ్యారు గేమ్ ఎలా ఆడాలో.. లెక్కలు వేసుకుంటున్నారు టీమ్ స‌భ్యులు.

read more news :

Happy Birthday Shah Rukh Khan : షారూఖ్ ఖాన్ గురించి ఈ 10 ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకు తెలుసా..!

horoscope : 2-11-2022 ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News