Homecinemaబాలకృష్ణ పొలిటికల్ ప్ర‌శ్న‌లు..పవన్ కళ్యాణ్ రిప్లై ఏంటంటే?

బాలకృష్ణ పొలిటికల్ ప్ర‌శ్న‌లు..పవన్ కళ్యాణ్ రిప్లై ఏంటంటే?

Telugu Flash News

Pawan Kalyan Reply on Bala Krishna Politicial questions in Unstoppable season 2 episode : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ రెండవ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుద‌లైంది. ఇందులో బాలయ్య పవన్ ని పూర్తిగా పొలిటికల్ సంబంధించిన ప్రశ్నలు అడిగారు.

పవన్ ని తికమక పెట్టేలా బాలయ్య సూటి ప్రశ్నలు సంధించారు. అసలు పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ? అని ప్రశ్నించారు. దీనితో పవన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

అనంత‌రం బాలయ్య నువ్వు తెలుగుదేశంలో చేరి ఉండొచ్చు కదా అని అన్నారు. దీనికి పవన్ ఎలాంటి సమాధానం ఇస్తారనే ఉత్కంఠ ప్రోమోతో పెరిగింది.

పవన్ కళ్యాణ్ ఆ మధ్యన ఇప్పటం గ్రామానికి వెళుతున్నప్పుడు కారు టాప్ పై ప్రయాణించడం పెద్ద వివాదమే సృష్టించింది. బాలయ్య ఆ ఫోటో చూపిస్తూ ఏంటి ఈ గొడవ అని అడిగారు.

దీనికి పవన్.. కారులో కూర్చోకూడదు, నడిచి వెళ్ళకూడదు, కారుపై అభివాదం చేయకూడదు, రూమ్ లో కూడా ఉండకూడదు.. అందుకే చాలా కాలం తర్వాత కొంచెం తిక్క వచ్చింది అంటూ వైసిపి ప్రభుతం తనపై విధించిన ఆంక్షలని ఉద్దేశించి సమాధానం ఇచ్చారు.

పవన్ సినిమాలు మానేసి ప్రజాసేవకు పూర్తిగా అంకితం అవ్వాలి అని బాలయ్య అడగగా.. ప్రేక్షకుల నుంచి అవును అని సమాధానం వచ్చింది.

-Advertisement-

also read :

kalyani priyadarshan Latest Saree Stills, Photos, Pics 2023

Ashika Ranganath Photos at Amigos Movie Pre Release Event

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News