HomecinemaBala Krishna: నాపై పుకార్లు పుట్టించే ద‌మ్ము ఎవ‌డికైన ఉందా.. బాల‌య్య కూల్ వార్నింగ్‌

Bala Krishna: నాపై పుకార్లు పుట్టించే ద‌మ్ము ఎవ‌డికైన ఉందా.. బాల‌య్య కూల్ వార్నింగ్‌

Telugu Flash News

Bala Krishna: నంద‌మూరి బాల‌కృష్ణలో ఇటు మాస్, అటు క్లాస్ ఉన్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఆయ‌న చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. అస‌లు బాల‌య్య‌లోని అస‌లు విష‌యాన్ని అన్‌స్టాప‌బుల్ షో బ‌య‌ట‌పెట్టింది. ఇందులో ఆయ‌న చేసే ర‌చ్చ‌ని చూసి జ‌నాలు తెగ థ్రిల్ అవుతున్నారు. మొద‌టి సీజ‌న్ మంచి విజ‌యం సాధించ‌డంతో రెండో సీజ‌న్ ఇటీవ‌ల మొద‌లు పెట్ట‌గా, దీనికి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది. రెండో సీజ‌న్ మొదటి రెండు ఎపిసోడ్స్ కి గెస్ట్స్ గా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ రావడం జరిగింది. ఇక మూడవ ఎపిసోడ్ గెస్ట్స్ గా మరో ఇద్దరు యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్ వచ్చారు.

అంత ద‌మ్ముందా..

కుర్ర హీరోలతో బాలయ్య హోస్టింగ్ మాములుగా లేదు. అన్ స్టాపబుల్ షో వేదిక‌గా బోల్డ్ ప్రశ్నలకు వేదిక కాగా ఎఫైర్ రూమర్స్ తో పాటు అనేక విషయాలు చర్చకు వచ్చాయి. ఈ క్రమంలో శర్వానంద్ బాలయ్యను ధైర్యం చేసి ఇక ప్ర‌శ్న‌ అడిగారు. సార్ మీరు అనేక మంది హీరోయిన్స్ తో పని చేశారు కదా. ఎఫైర్ రూమర్స్ రాకుండా ఎలా మ్యానేజ్ చేశారు? అని అడ‌గ‌గా, దానికి బాల‌య్య అదిరిపోయే స‌మాధానం ఇచ్చాడు.దీనికి బాలయ్య కాస్త కొంటె సమాధానమే చెప్పారు. నాపై వార్తలు రాసే దమ్ము ఎవరికి ఉంది అంటూ కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో సామాజిక మాధ్యమాల ప్రభావం లేకపోవడంతో ఇవేవీ పెద్ద‌గా పత్రికల్లో వచ్చేవి కావన్నారు.

హీరోయిన్లపై ఈ రకమైన వార్తలె కూడా ఉండేది కాదు. బాలయ్యకు ఎంత మందితో సంబంధం ఉందనే విషయం రాసే ధైర్యం కూడా ఎవ‌రు చేసేవారు కాదు. కాగా కెరీర్ బిగినింగ్ నుండి బాలయ్య ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ తో ఎఫైర్స్ నడిపినట్లు కొన్ని పుకార్లు ఉన్నాయి. ముఖ్యంగా ఒక టాప్ స్టార్ హీరోయిన్ తో బాలకృష్ణ బహిరంగంగానే ఎఫైర్ నడిపారన్న వాదన కూడా ఉంది. ఓ మూవీ విషయంలో ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో మళ్ళీ కలవలేదని గాసిప్స్ చాలానే వ‌చ్చాయి. ఇక బాల‌య్య ప్ర‌స్తుతం త‌న 107వ సినిమాతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. అఖండ సినిమా మంచి హిట్ కొట్ట‌డంతో ఈ చిత్రంపై భారీ ఆశ‌లే పెట్టుకున్నారు అభిమానులు.

also read:

Twitter: ట్విట్ట‌ర్‌లో నా ఉద్యోగం ఊడింది అంటూ సంతోషం.. ఎలోన్ మస్క్ కి కౌంట‌ర్ మాములుగా లేదుగా..!

Bigg Boss 6: బెలూన్ టాస్క్‌లో గెలిచిందెవరు? హౌజ్‌కి కొత్త కెప్టెన్‌గా లేడీ బాస్..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News