Bala Krishna: నందమూరి తారకరామారావు నటవారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి టాప్ హీరోగా ఎదిగాడు బాలయ్య. కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసి ప్రేక్షకులకి మంచి వినోదం పంచిన బాలయ్య ఇప్పటికీ అంతే స్పీడ్‌తో సినిమాలు చేస్తున్నాడు.
అయితే బాలకృష్ణ ఒక్క జానర్‌లోనే కాక జానపద, పౌరాణిక సినిమాలు చేసాడు. ఒక కురూపిగా, డీ గ్లామర్ రోల్‌లో కూడా కనిపించి ఔరా అనిపించడు. నిజానికి ఓ స్టార్ హీరో అలాంటి పాత్ర చేయడానికి సాహసించడు. కాని బాలకృష్ణ ఆ రోల్‌ని ఛాలెంజ్‌గా తీసుకొని ప్రేక్షకులచేత ప్రశంసలు పొందాడు.
డెడికేషన్..
సింగీతం, బాలకృష్ణది టాలీవుడ్‌లో హిట్ కాంబినేషన్. సింగీతం కథలపై బాలయ్య చాలా నమ్మకం ఉంచేవారు . బాలకృష్ణకి సింగీతం భైరవద్వీపం కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పేసారట. అందులో కురూపిగా కనిపించడం కోసం హీరో కనీసం రెండు గంటలైనా మేకప్ కోసం కేటాయించారు.
లంచ్ సమయంలో మేకప్ తీసేస్తే రెండు గంటల సమయం వృధా అవుతుందని భావించిన బాలయ్య దాదాపు 10 రోజులు కేవలం జ్యూస్‌లు మాత్రమే తాగి కడుపుకు నింపుకునే వారని సింగీతం ఇప్పటికీ చాలా సందర్భాల్లో అన్నారు. అయితే బాలయ్య పడ్డ కష్టానికి ప్రతిఫలం అయితే దక్కింది.
బాలయ్య సినిమా షూటింగ్ విషయంలో చాలా పర్‌ఫెక్ట్ ఉంటారు. అందరికంటే ముందే వస్తారని ఆయనతో పనిచేసిన నటీనటులు చెబుతుంటారు. ఎన్టీఆర్ ఎలాగైతే తన జీవితంలో క్రమశిక్షణతో నడుచుకునేవారో బాలయ్య కూడా అంతే క్రమశిక్షణతో ఉంటారు.
ఆయన చాలా సీరియస్‌గా ఉంటారని అందరు భావిస్తుంటారు. కాని ఆయన హోస్ట్ చేసిన అన్‌స్టాపబుల్ షో అందరిలో ఉండే అనుమానాలు తొలగించింది. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత అనీల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకి పిచ్చెక్కించడం ఖాయం.
ఇవి కూడా చదవండి :
Bigg Boss Telugu 6: డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు.. హౌజ్ నుండి ఈ వారం ఎలిమినేట్ కానుంది ఎవరంటే..!
Viral Video: కరెంట్ తీగలని టచ్ చేసిన హెలికాఫ్టర్.. అందులోని వారి పరిస్థితి ఏంటి?