HomecinemaBala Krishna : బాల‌య్య చేతిలో శ్రీలీల త‌న్నులు తిన్న‌దా.. ఇందులో నిజ‌మెంత‌?

Bala Krishna : బాల‌య్య చేతిలో శ్రీలీల త‌న్నులు తిన్న‌దా.. ఇందులో నిజ‌మెంత‌?

Telugu Flash News

Bala Krishna : విశ్వ‌విఖ్యాత న‌ట సార్వభౌమ నందమూరి తార‌క‌రామారావు న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాల‌కృష్ణ ఎన్నో ర‌కాల చిత్రాలు చేసి స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ఇప్పుడు ఆయ‌న‌కు రెండు తెలుగు రాష్ట్రాల‌లో అశేష‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నంద‌మూరి బాల‌కృష్ణ‌ది చిన్న‌పిల్లాడి మ‌న‌స్త‌త్వం అని చాలా మంది చెబుతుంటారు. ఆయన అంద‌రితో చాలా స‌ర‌దాగా ఉంటారు. అయితే కోపం వ‌స్తే మాత్రం చెంప చెళ్లుమ‌నిపించ‌డం మ‌నం చూశాం. ఆ మ‌ధ్య ‘వీరసింహారెడ్డి’ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఒంగోలులో జ‌ర‌గ‌గా, ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్క‌డికి వెళ్లారు బాల‌య్య‌.ఆయ‌న‌ని చూసేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. అప్పుడు బాలకృష్ణ నడిచి వస్తున్న క్ర‌మంలో ఓ అభిమాని శాలువా కప్పేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ స‌మ‌యంలో బాలయ్య తలపై ఉన్న కళ్లజోడు ఆ అభిమాని చేయి తగిలి కింద పడిపోగా, బాల‌య్య ఒక్క‌సారి సీరియ‌స్ అయ్యారు. అదృష్టం బాగుండి అతను చెంప‌దెబ్బ నుండి త‌ప్పించుకున్నాడు.

అయితే బాల‌య్య కొట్టిన కూడా మాకు ఇష్ట‌మే అని అభిమానులు అంటుంటారు. తాజాగా బాల‌కృష్ణ మంచి ఫామ్‌లో ఉన్న అందాల భామ శ్రీలీల చెంప చెళ్లు మ‌నిపించార‌ట‌. దీంతో అమ్మ‌డు ఏడ్చుకుంటూ వెళ్లిపోయింద‌నే ప్ర‌చారం న‌డుస్తుంది. వివ‌రాల‌లోకి వెళితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఎన్‌బికె 108 చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల బాలయ్య మేనకోడలి పాత్రలో క‌నిపించ‌నుంద‌ని టాక్. అయితే ఈ మూవీలోని ఓ స‌న్నివేశంలో భాగంగా బాలకృష్ణ శ్రీలీలని చెంపదెబ్బ కొట్టే సన్నివేశం ఉంటుద‌ట‌.భావోద్వేగాలు కృత్రిమంగా కాకుండా సహజంగా కనిపించేందుకు శ్రీలీల‌.. బాల‌య్య‌ని నిజంగానే కొట్ట‌మ‌ని చెప్పింద‌ట‌.

అయితే ఫ్లోలో బాలకృష్ణ.. శ్రీలీలను చెంపపై గట్టిగా కొట్టాడు. దాంతో సెట్ట్స్ లో ఉన్న వారంద‌రూ షాక్‌తో మౌనంగా ఉండిపోయారు. అనిల్ రావిపూడి కూడా సైలెంట్ ఉండిపోవ‌డ‌మే కాకుండా సీన్ పూర్తయిన తర్వాత కూడా కట్ చెప్పకుండా కామ్‌గా ఉన్నాడు. అంటే ఆ షాట్ సహజంగా వచ్చిందని , కాక‌పోతే శ్రీలీల షూటింగ్ లో భాగంగా ఏడుస్తూ వెళ్లిపోయిందని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. మ‌రి కొందరు అయితే శ్రీలీల నిబద్ధతను కొనియాడుతున్నారు. ఇక ఇటీవ‌ల జ‌రిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న శ్రీలీల‌ తెలుగులో ప్రసంగించి అల‌రించిన విష‌యం తెలిసిందే. బాల‌య్య 108వ చిత్రం తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఉంటుందని అనిల్ రావిపూడి ఇప్పటికే చిన్న లీక్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదలైన బాలయ్య లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆకర్షిస్తుంది. దసరా కానుకగా మూవీని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

read more news :

Delhi Weather : గాలి దుమారం.. విమానాల రాకపోకలు ఆలస్యం

Niharika:నిహారికతో విడాకుల విష‌యంపై క్లారిటీ ఇచ్చిన భ‌ర్త‌.. దీంతో ఫిక్స్ అయిపోవ‌చ్చా..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News