Homecinemabala krishna : నేనేం త‌క్కువ కాదు అంటున్న బాల‌కృష్ణ.. వెబ్ సిరీస్‌కి సై..!

bala krishna : నేనేం త‌క్కువ కాదు అంటున్న బాల‌కృష్ణ.. వెబ్ సిరీస్‌కి సై..!

Telugu Flash News

nandamuri bala krishna latest news : నంద‌మూరి బాల‌కృష్ణ రోజురోజుకి త‌న‌లోని కొత్త కోణాన్ని బ‌య‌ట‌కు తీస్తున్నాడు. న‌టుడిగా ఇన్నాళ్లు అల‌రించిన బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోతో హోస్ట్‌గాను అద‌ర‌గొట్టాడు.

టాలీవుడ్ స్టార్ హీరోలను ఇంటర్వ్యూలు చేసి.. వారిలోని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ని బయటకు తీశారు. అన్ స్టాపబుల్ అంటూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో తెగ ర‌చ్చ చేసిన బాల‌య్య‌ తొలి షోతోనే భారీ విజయాన్ని నమోదు చేసుకొని తాను ఏదైనా చేయగలడు అనే న‌మ్మ‌కం తెప్పించాడు.

ఆహాలో అన్ స్టాపబుల్ తో సక్సెస్ అవ్వడంతో ఈ టాక్ షో నిర్మాత అల్లు అరవింద్ బాలకృష్ణతో వెబ్ సిరీస్ చేస్తే బాగుంటుందన్న ఆలోచ‌న‌కి వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. ఈ విషయంపై బాలకృష్ణతో చర్చలు జ‌ర‌ప‌గా, దానికి సై అన్న‌ట్టు కూడా తెలుస్తుంది.

ఇప్పటికే సీనియర్ హీరోలు కూడా చాలామంది వెబ్ కంటెంట్ లోకి ఎంటర్ అవుతున్న నేప‌థ్యంలో నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఇప్పుడు త‌న‌లోని మ‌రో కోణం చూపించేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌ని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో త‌న 108వ మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే.

also read : 

medico preethi case : అసలు ప్రీతి ఆత్మహత్య ఘటనలో ఏం జరిగింది? కీలక అనుమానాలు వెలుగులోకి..

-Advertisement-

Satvik Suicide Case : సాత్విక్‌ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు!

Kiara Advani Latest Photos at WPL Opening Ceremony 2023, Videos

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News